ఏపీలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు ఇంత ఈజీనా!

Written by

ఏపీలో అన్ని శాఖలు ఆన్ లైన్ బాట పడుతున్నాయి. సంబంధిత శాఖల వివరాలు, సేవల్ని ఆన్ లైన్ చేసే పని వేగంగా నడుస్తోంది. వ్యవసాయంతోపాటు రెవిన్యూ శాఖలోను ఇప్పటికే ఆన్ లైన్ విధానం అమల్లోకి వచ్చింది. పంటల్ని కూడా అమ్ముకునేందుకు ఈ- క్రాప్ విధానం ఉంది. ఇదే ట్రాక్ లోకి వచ్చేసింది రవాణాశాఖ. తన సేవల్ని ఆన్ లైన్ ద్వారా పొందే ఫెసిలిటీ అందుబాటులోకి వస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్లు ఈజీ కాబోతున్నాయి..మార్చి1 నుంచి 83రకాల సేవల్ని ఆన్ లైన్ అందించబోతోంది. ముఖ్యంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఓ ఆఫీసు చుట్టు తిరగాల్సిన పని లేకుండా చేస్తోంది. వాహనాల కొన్న వెంటనే వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయడం ద్వారా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ పొందే విధంగా ఆన్ లైన్ సేవలు అందించబోతున్నారు. దీని వల్ల పనిలో పారదర్శకత పెరగడమేకాదు లంచాల గోల అసలే ఉండదు. ఇక విలువైన సమయం వృధా కాదు. అలాగే వాహనంతోపాటు హెల్మెట్ ను ఉచితంగా ఇచ్చేలా డీలర్లను ఆదేశించింది. ఆన్ లైన్ వ్యవస్థతో ఇక ఏజెంట్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం వాహన దారులకు ఉండదు. ఆ టేబుల్ ..ఈ టేబుల్ అంటూ కాగితాలు పట్టుకుని రోజుల తరబడి ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని కూడా ఉండదు. పీఆర్ కు రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే తాత్కాలిక రిజిస్ట్రేషన్ విధానానికి పుల్ స్టాప్ పెట్టింది. ఆన్ లైన్ పుణ్యమా అని అటు అధికారులపై కూడా పని ఒత్తిడి తగ్గినట్ట

Article Categories:
More · News
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title