పచ్చళ్ళ అమ్మకం లో ఒక రివల్యూషన్ – Raju [email protected]దాట్ల సౌజన్య తో కోస్తాలైఫ్

Written by

ఏదో చదివేసాం,పెళ్ళైపోయింది ఇల్లు,పిల్లల్ని చూసుకుందాం అనే రోజులనుండి, ఆకాశం లోసగం అన్నిరంగాల్లోనూ, ప్రతిభని చూపించగలం అనే ధీమాతో అమ్మాయిలు ముందడుగు వేస్తున్న రోజుల్లోకి వచ్చేసాం.మేమూ తక్కువకాదు, అవకాశం సృష్టించుకుని మరీ ఆర్ధికప్రగతి సాధించగలం అనే ఆత్మవిశ్వాసం తో ఉన్న గృహిణులూ ఉన్నారు.ఈ గృహిణులకోవలోకే వస్తారు శ్రీమతి దాట్ల సౌజన్య.
ఇప్పుడు సౌజన్య మాటల్లోనే ఆ వివరాలన్నీ తెలుసుకుందాం..

కోస్తాలైఫ్:మీ గురించి చెప్పండి సౌజన్యా!

సౌజన్య:మాది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరండీ.నేను డిగ్రీవరకూ చదివాను.అయితే పెళ్ళయ్యాకా మావారి ఉద్యోగరీత్యా హైద్రాబాద్ లో ఉంటున్నాం.

కోస్తాలైఫ్:ఓకే దట్స్ నైస్.మరి ఈ పచ్చళ్ళ బిజినెస్ చెయ్యాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది.ఈ వ్యాపారమే చెయ్యాలనుకోవడానికి ఏవైనా ప్రత్యేకమైన కారణాలున్నాయా సౌజన్యా?

సౌజన్య:అంటే!!మా అమ్మగారు పచ్చళ్ళని చాలాబాగా పెడతారు.నేను మావూరు వెళ్ళినప్పుడు,ఆవిడ తయారు చేసి ఇచ్చిన పచ్చళ్ళని తెచ్చుకుని ,హైద్రాబాద్ లో ఫ్రెండ్స్ కి,టేస్ట్ చూడటానికి కొద్ది కొద్దిగా ఇస్తుంటే, వాళ్ళు రుచి చూసి చాలా బావున్నాయి! మాకూ కావాలని అడగటం మొదలు పెట్టారు.అప్పుడు నేనే,ఇవి తయారు చేసి ఎందుకు అమ్మకూడదని అనుకున్నాను,అనుకున్నదే తడవుగా మావారికిచెప్పాను.

కోస్తాలైఫ్:ఒక్క నిమిషం సౌజన్యా ,మీకు ఈ పచ్చళ్లు తయారు చెయ్యడం ముందే వచ్చా!! మీ ఆలోచన విని మీవారు ఏవన్నారు ?

సౌజన్య:లేదండీ నాకు ముందురాదు.మావారు సరే నీ ఇష్టం, నేను సహకరిస్తా అని మాట ఇచ్చారు.అప్పుడు మా అమ్మగారిదగ్గర పచ్చళ్ళని తయారు చెయ్యడం నేర్చుకుని ఒక వెబ్ సైట్ ని “www.Raju Pickles” పేరుతో మొదలుపెట్టాం..

కోస్తాలైఫ్:పచ్చళ్లు అంటే ఏవేం తయారు చేసి అమ్ముతారు.ముందు ఆన్ లైన్ లో బిజినెస్ చెయ్యడం మొదలుపెట్టారా ?

సౌజన్య: అవునండి.ఆన్ లైన్ లోనూ బుక్ చేసుకుంటే మేము డెలివరీ చేస్తున్నాం.మేము నాన్ వెజ్ పచ్చళ్ళని..చికెన్, ప్రాన్స్, బోన్ లెస్ చికెన్,బోన్స్ తో ఉండే చికెన్ ఇలా నాలుగు వెరైటీలని తయారు చేస్తున్నాం.

కోస్తాలైఫ్:ఓకే..కేవలం నాన్ వెజ్ తోనే తయారు చేస్తారా మీరు. కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉందండీ ?

సౌజన్య:చాలాబావుందండి.మా కస్టమర్స్ లిస్ట్ లో సెలెబ్రిటీస్ కూడా ఉన్నారు,US,UK లో కూడా కస్టమర్స్ ఉన్నారండీ మాకు.ముందు నాన్ వెజ్ తో మొదలుపెట్టామండీ, త్వరలోనే మిగిలినవి చేసే ఆలోచన ఉంది..

కోస్తాలైఫ్:మీరు రాజు పికిల్స్ అని పేరెందుకు పెట్టారు.పైగా కోడి పందాలకి ,రొయ్యల ఎగుమతులకి భీమవరం బాగా ఫేమస్. సో అలా భీమవరం ఫ్లేవర్ ఏవైనా కనిపిస్తుందా మీ పచ్చళ్ళలో.

సౌజన్య:అవునండి మావారిది భీమవరం దగ్గరే.పైగా మేము పచ్చళ్ళ తయారీకీ కావల్సిన కారం మొదలైనవన్నీ భీమవరం నుండే తెప్పించి పచ్చళ్ళని తయారు చేస్తాం.క్వాలిటీలో రాజీపడం,పచ్చడి రంగు మారదు, చాలా ఫ్రెష్ గా ఉంటుంది.

కోస్తాలైఫ్:మీరు ఒక్కరే చేస్తున్నారా..ఎలా ఇదంతా సాధ్యమవుతోంది మీకు.నెలకి ఎన్ని కేజీలవరకూ చేస్తారు మీరు.

సౌజన్య:లేదండీ, నేను ఇద్దరు మనుషులని నా పనిలో సాయం కోసం పెట్టుకున్నాను.మావారి సహకారం చాలా ఉంది.ఓ పక్క ఉద్యోగం చేస్తూనే సెలవురోజుల్లో నాకు సహాయపడతారు మావారు..నెలకి వంద కేజీలదాకా తయారు చేస్తామండి.

కోస్తాలైఫ్:వెల్ డన్ సౌజన్యా! మీలాంటి మహిళలు ఇలా వినూత్నం గా ప్రయత్నించి సాధిస్తే చాలామందికి మీరు స్ఫూర్తినిచ్చినవారవుతారు..మీ బిజినెస్ మరింత వృద్ధిచెందాలని కోరుకుంటూ అభినందిస్తోంది కోస్తాలైఫ్..

Raju Pickles

Article Categories:
Anything Everything
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title