APCRDA తో కలిసి పనిచేస్తానంటున్న L&T

Written by

కొన్ని కాంబినేషన్స్ కొన్ని మంచి పనులకి శ్రీకారం చుడతాయనే వాస్తవాన్ని ఒప్పుకోవాలి, మంచి మార్పుకి సంకేతాలైన పెద్ద పెద్ద సంస్థలు తామే ముందుకొచ్చి మేమూ మీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాం అని ముందుకొస్తే అంతకన్నా కావలిసినది ఏముంటుంది.

ఇంజనీరింగ్ దిగ్గజం,నిర్మాణ రంగం లో విశేషమైన అనుభవం ఉన్న,అంతర్జాతీయం గా పేరు తెచ్చుకున్న “లార్సన్ అండ్ టూబ్రో” సంస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి, సంబంధించిన కొన్ని ఇంఫ్రాస్ట్రక్చర్ డెవెలప్ మెంట్ వర్క్స్ కి ఏపీసీఅర్డిఏ(Andhra Pradesh Capital Region Development Authority )తో కలిసి పనిచేస్తానని ముందుకొచ్చింది.
దాదాపు 2 వేల 265 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్ట్ పనులని సొంతం చేసుకుంది ఎల్ అండ్ టీ సంస్థ.రాజధాని అమరావతి లో 6,7,10 జోన్లకి సంబంధించిన రోడ్లు ఇన్వెస్టిగేషన్,డిజైన్, నిర్మాణం తోపాటు డ్రెయిన్స్,వాటర్
సప్లై,కల్వర్టులు,సరైన డ్రైనేజ్ వ్యవస్థ మొదలైన కాంట్రాక్ట్స్ చేపట్టింది..

అమరావతి ని ఒక స్మార్ట్ సిటీ గా రూపొందించే క్రమం లో తనదైన రీతిలో పనిచేస్తున్న ఏపీసీఅర్డిఏ తో కలిసి అంతే వాల్యూం తో ఎల్ అండ్ టీ కూడా పని చేస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

Article Categories:
Anything Everything
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title