విజయనగరం హీరో- బండారు సునీల్ కుమార్

Written by

హీరో అంటే ఏదో సినిమాల్లో హీరో అనుకుంటారేమో అబ్బే అస్సలు కాదు కష్టపడి జీవితం లో పైకొచ్చిన హీరో..

పేదరికం నుంచి కష్టపడి ఉన్నత స్థాయికి వెళ్ళినవాళ్ళని పరిచయం చేస్తే ఓ నలుగురు స్ఫూర్తి ని పొందుతారు.చిన్న వయసులో పైకొచ్చినవాళ్ళ గురించి పదే పదే చెప్తే ఓ ఇద్దరికేనా అవగాహన వస్తుంది.మన ఖర్మకొద్దీ మన మీడియా ఇలాంటి వాటిని ప్రసారం చెయ్యడానికి మహా ఇబ్బందిపడిపోతుంది.అనుష్క పెళ్ళి చేసుకుంటుందా లేదా!సమంత పెళ్ళైనా సినిమాల్లో నటిస్తుందా!లేదా!ఇవే మనకి ఇంపార్టెంట్ అన్నట్టు కొన్ని చానల్స్ ఫిక్స్ అయి మనకీ ఇవే వార్తలని అంటగట్టే ప్రయత్నం చేస్తాయి.

సరే ఎన్ననుకుని ఏం లాభం కాని ఒకసారి ఇది చదవండి..

బండారు సునీల్ ది బీద కుటుంబం.ఎక్కడో విజయనగరం జిల్లా లోని పల్లెటూరు “అలమండ సంత” గ్రామానికి చెందిన సునీల్ చదువుని నమ్ముకున్నాడు.అతని తండ్రి బతకడం కోసం విశాఖపట్నం వచ్చి కిరాణా షాప్ పెట్టుకుని,సునీల్ ని అతని చెల్లెల్ని చదివిస్తూ భార్య సాయం తో కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు.సునీల్ కూడా చదువుకుంటూ తండ్రి కి హెల్ప్ చేసేవాడు.

బండారు సునీల్ పదో తరగతిలో 513 మార్కులు తెచ్చుకున్నాడు,అంతేకాదు ఎంసెట్‌లో 682 ర్యాంకు కూడా సాధించి,ఐటీ జేఈఈలో 7000 ర్యాంకు తెచ్చుకున్నాడు,ఇంటర్మీడియెట్‌ పూర్తయ్యాక కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ)లో ఇంటిగ్రేటెడ్‌ పీజీ పూర్తి చేసి రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రంగరాజన్‌ చేతులమీదుగా పట్టా అందుకున్నాడు.పీజీ పూర్తిచేసి ముంబైలోని క్రెడిట్‌ స్విస్‌ బ్యాంక్‌ (స్విట్జర్లాండ్‌)లో రిస్క్‌ ఎనలిస్ట్‌గా బాధ్యతలు చేపట్టాడు. 24 ఏళ్ల చిన్నవయసులోనే స్విట్జర్లాండ్‌లోని క్రెడిట్‌ స్విస్‌ బ్యాంక్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యాడు.

సునీల్ నీలాంటివాళ్ళు ఈదేశానికి చాలా అవసరం.”All the very best”

Article Categories:
Anything Everything
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title