రత్నాచల్ ఫుల్ రష్

Written by

జనవరి 31, 2016

సమయం సాయంత్రం

ఒక్కసారిగా పట్టాల పైకి జనం.. ముందు రాళ్లు వర్షం..తర్వాత విధ్వంసం.. నిమిషాల్లో రైలు తగలబడింది . పదిరోజుల క్రితం కాపు రిజర్వేషన్ల సెగలో తగలబడిన రత్నాచల్ పాత జ్ఞాపకాల్ని వదలిపెట్టింది. మళ్లీ పదిరోజుల తర్వాత పట్టాలెక్కింది. ఈ ట్రైన్ కోసం ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ త్వరగానే ఫలించింది. పూల వర్షం కురిపించి మరీ స్వాగతం పలికారు. మళ్లీ పట్టాలెక్కిన రత్నాచల్ కు అదే ఆదరణ..అదే డిమాండ్. మంగళవారం నుంచి మొదలైన రత్నాచల్ సర్వీసు ప్రయాణికులతో కిటకిటలాడింది. మంటల్లో దహనమైన బోగీల స్థానంలో కొత్తవి కాకపోయిన పాతవాటిని రీ ప్లేస్ చేశారు. ఈ సర్వీసుకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని అధికారుల అడ్జెస్ట్ మెంట్ తో మళ్లీ ట్రాక్ మీద పరుగులు తీయడం మొదలుపెట్టింది.

Article Categories:
More
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title