మొగుణ్ని ఏవండి అని పిలుస్తున్నవాళ్లు ఎందరు ?

Written by

సర్వే చేస్తే సంగతి తెలుస్తుందంటారా..! అంత సీరియెస్ నెస్ ఎందుకులెండి. విషయం వేరే ఉంది. మేరేజ్ రిలేషన్స్ ఇండియాలో ఇంత బలంగా ఎలా ఉన్నాయ్ ? మిగతా దేశాల్లో లేనిది ఏంటి ? ఇక్కడ ఉన్నదేంటో కనుక్కునేందుకు యూనిసెఫ్ అనుబంధ విభాగం ఒకటి మూడు నెలల కిందట ఓ సర్వే చేసిందట ! మీ అనుబంధాలు ఎలా ఉంటాయ్… భార్యని ఎలా ట్రీట్ చేస్తారు… భర్తని ఎలా భావిస్తారు… లాంటి ప్రశ్నలు మొత్తం 28 ఉన్నాయ్ అందులో ! ఈ పిడకల వేటలో ఓ అద్బుత రామాయణం బైటపడింది. ఇండియాలోనూ ఇపుడు సంబంధాల్లో ఛేంజెస్ వస్తున్నాయట. వర్క్ కల్చర్ పెరగడం… భార్య కూడా ఉద్యోగం చేయడం… లేదంటే బిజినెస్ యాక్టివిటీతో ఇద్దరూ బిజీ అయిపోవడం లాంటివన్నీ మ్యూచువల్ కన్సర్న్ మీదే కాదు… పర్సనల్ అప్రోచ్ మీద కూడా ప్రభావం చూపించే విషయాలైపోయాయని తేల్చింది సర్వే !

మీ భార్య మిమ్మల్ని ఏమని పిలుస్తోంది…?

ఇంతకీ ఈ పిలుపుల గోలేంటి ? అంటే… ఏం లేదు. ఒకప్పుడు మన దేశంలో అదీ ముఖ్యంగా సౌత్ లో భర్త పేరు చెప్పడానికే భార్యలు సిగ్గుతో మొగ్గలు అయిపోయేవారు. చాలా సినిమాల్లో చూశాం. తర్వాత జనరేషన్ మారింది ఓ పాతికేళ్లకి ! నేను ఫలానా వెంకటేశ్వరరావు గారి తాలుకా అని చెప్పేవాళ్లు. ఇప్పుడంటే వినడానికి వింతగా ఉంది కానీ తాలూకాలు… మండలాలు. ఇది వాస్తవం ! ఇక పేర్లు చెప్పే రోజులు వచ్చేశాయ్. అంటే ఇప్పటికి ఓ ముప్పై ఏళ్ల వెనక్కికెళ్తే సరిగ్గా ఇదే టైమ్ నడుస్తుంటుంది. తర్వాత మారింది అసలు కథ. నా సామి రంగా… మొగుణ్ని నువ్వు అనే రోజులు వచ్చేశాయ్. పల్లెటూర్లోనో కాయకష్టం చేసుకునేవాళ్లో అంటారు కదా అంటే, అది కాదు. ఇక్కడ చెబుతున్నది ప్రామాణికంగా తీసుకునే… ఓ మిడిల్ క్లాస్, అబౌ మిడిల్ క్లాసు సంగతి. ఓ పదేళ్ల నుంచి ఆ బౌండరీ కూడా దాటేసి… హే మేన్, ఎరా అంటున్నారు.

బుగ్గలు నొక్కుకొని కాదని ఖండించొచ్చు నలుగురిలో ! కానీ ఇది ఎంత నిజమో మనలో చాలామందికి తెలుసు. ప్రైవసీ ఉన్నప్పుడే కాదు…ఇపుడు ఫ్యామిలీ మెంబర్స్ ముందు కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయిపోతోంది. యూనిసెఫ్ సర్వే లెక్కలో… ఇప్పుడు అర్బన్ ఇండియాలో 40 మంది మొగుణ్ని ఎరా అంటామని చెప్పడానికి వెనకాడటం లేదు. కాకపోతే కొన్ని డిస్కౌంట్లున్నాయ్. అత్తగారు ఉన్నప్పుడు… ఆడపడుచు ఉన్నప్పుడు అనబోమనో లేదంటే నాలుగ్గోడల మధ్యే అయితే ఇబ్బంది లేదనో చెబుతున్నారు. ఇక పేరు పెపెట్టి పిలిచినా పర్వాలేదు అంటున్నవాళ్లు మరో పాతికశాతం వరకూ తేలారు. అంటే 65 శాతం మంది రిలేషన్ ని మోడ్రన్ ట్రెండ్ కి తెచ్చి బిగించేశారు. అంటామని, అన్నా తప్పులేదని చెబుతున్నారు వీళ్లు ! అంటే… ఇప్పటికీ సుమారు 35 శాతం మంది మాత్రం సంప్రదాయ ధోరణిలోనే ఉన్నారు. మనకి పాస్ మార్కులకి ఢోకా లేదు !

ఇంతకీ ఎందుకిలా మారుతోంది ? వేలంవెర్రో… మొగుడంటే లెక్కలేని తనమో కాదు. స్పీడు. దగ్గరితనం. మోడ్రన్ ట్రెండ్ అన్నీ ఉన్నాయ్. ఏవండి ఏవండి అంటూ… సిగ్గుల మొగ్గలవ్వడం పాత సంగతి. అరె…అది కాదు, అంటూ మొదలు పెట్టి మాట్లాడేయడం కరెంట్ పాలసీ అంటున్నారు వీళ్లంతా ! ఓ రకంగా ఇది కూడా ఒకందుకు మంచిదే ! పరిస్థితులకి తగ్గట్టుగా మారడం… అవరాలకి తగినట్టు సర్దుకుపోవడం, అన్నిటికీ సాయపడటం లాంటివి ఈ పిలుపులతో మొదలవుతున్నాయని… సోషియాలజిస్టులు చెబుతారు. నిజమే ! ఇదేదో మన సంప్రదాయాల పరువు తీసే కార్యక్రమం అయితే కాదుకానీ… దగ్గరితనానికి అర్థం మారింది అంతే ! అందుకే పిలుపూ మారింది. పలికే వాళ్లకీ ఇబ్బంది లేదు. వాళ్ల తల్లులకి తప్ప. మధ్యలో మనకెందుకు ! మనలో ఎవరైనా ఉంటే ఇపుడు దైర్యంగా చెప్పుకోవచ్చు నా వైఫ్ నన్ను ఏరా అంటోందని !

Article Categories:
More
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title