బందరు చరిత్రలో కొత్త పేజీ ఎప్పుడు?

Written by

కృష్ణా జిల్లా వాసుల దశాబ్దాల నాటి కల బందరు పోర్టు . ఒక్క ఉప్పెనతో చరిత్ర నుంచి చీకట్లోకి వెళ్లిపోయింది. పోర్చుగీసుల కాలంలో పోర్టు నుంచి వ్యాపారా లావాదేవీలు జరిగేవని తెలుసు. ఇంతకీ అంతకీ అసలు బందరుపోర్టు చరిత్ర లోతుల్లోకి వెళ్తే ఎన్నో విషయాలు బయటకొస్తున్నాయి. అంతా అనుకున్నట్టు కాకుండా ఇది 15వశతాబ్ధానికి ముందే ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. ఎన్నో వందల ఏళ్ల నాడే ఇక్కడి నుంచి సరుకు రవాణా జరిగేది. రాజుల కాలంలో చక్రం తిప్పింది.మనదేశాన్ని ఎక్కువ కాలం పాలించిన బ్రిటిషు వారు కూడా చాలా కాలంపాటు ఇక్కడి నుంచి రాకపోకలు నిర్వహించారు. క్రీస్తుశకం ఒకటో శతాబ్ధంలోనే బందరు పోర్టు రికార్డులకెక్కిన ఘనత ఉందని చరిత్ర చెబుతోంది. ఆంధ్రను పాలించిన శాతావాహనుల హయాంలోనే ఇక్కడ నుంచి గంధకం, కర్పూరం, ఇనుప ఖనిజం, పొగాకు వంటివి ఎగుమతులు, దిగుమతులు జరిగాయంటే పోర్టు ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవచ్చు.. క్రీశ.285 ప్రాంతంలో బందరును పాలించిన బృహత్పలాయనరాజు కాలంలో చేప కన్నుతో పోర్టుకు ఎంట్రన్స్ గేట్ లో ఉండేదట. గ్రీకులు, రోమన్ వ్యాపారులు ఈ ఓడరేవు నుంచి వ్యాపారాలు చేసినట్టు గ్రీకు చరిత్ర కారులు కడా ప్రస్తావించారు.16వ శతాబ్ధంలోనే అతి పెద్ద నౌకల పోర్టులో లంగరేశాయంటే పోర్టు చరిత్ర ఏపాటిదో చెప్పక్కర్లేదు. డచ్ , ప్రెంచ్ పాలనలో ఇక్కడ అభివృద్ధి ఎలా ఉండందంటే…విజయవాడలో జనాభా రెండు వేలు అయితే బందర్ లో 40వేలు జనాభా ఉండేది ఒకప్పుడు. 1940ల్లో అయితే బ్రిటీష్ వాళ్లు సౌత్ ఇండియాలోనే బందరు పోర్టును సైనిక స్థావరంగా మార్చుకున్న చరిత్ర ఉంది. ఇంత వెలుగు వెలిగిన బందరును 1864లో వచ్చిన పెను ఉప్పెన తలరాతను మార్చేసింది. బ్రిటిషోళ్లు తన స్థావరాలను చెన్నైకి షిప్ట్ చేయడంతో బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. బందరు శివారులోని గిలకలదిన్నె ప్రాంతంలో ఉన్న ఈ పోర్టు ప్రస్తుతం యాంకరేజీ పోర్టుగా మిగిలింది. చివరకు మళ్లీ బందరు పోర్టు గతేడాది భూముల నోటిఫికేషన్ తో ఫ్యాష్ బ్యాక్ ను రీకాల్ చేసింది.

Article Categories:
More
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title