పొలిటికల్ పంచ్ జాతకం ఆ హార్డ్ డిస్క్ లో ఉందా?

Written by

ఏదో పంచ్ విసిరేశాం… కేసు పెట్టారు… ఎదురుదాడి దిగి నెట్టుకొచ్చేశాం అనుకుంటున్న టైమ్ లో అనుకోని జలక్ తగిలినట్టే ఉంది ! ఆ హార్డ్ డిస్క్ తీసుకొని మళ్లీ విచారణకి రండి అంటున్న గుంటూరు పోలీసుల మాటలు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయ్. అసలే శుక్రవారం కోర్టు తీర్పు రాబోతున్న సమయంలో కొత్తగా ఈ హార్డ్ డిస్క్ టెన్షనేంటి ?

పొలిటికల్ పంచ్ పై కేసు వైసీపీకే కాదు జగన్ మెడకి కూడా చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఎంత అడ్డగోలు వాదన చేస్తున్నా… అనుకోకుండా ఇప్పటికే బిగిసిపోయింది జగన్ పార్టీ ! రవి కిరణ్ అసలు తమ ఉద్యోగే కాదంటూ పే రోల్స్ ని కూడా బుకాయిస్తోంది. అదేంటి అతని భార్యే చెప్పింది కదా అంటే పోలీసులు బెదిరించి చెప్పించారని అడ్డగోలుగా వాదిస్తోంది సాక్షి. కానీ ఆమె మొదటిసారిగా… రవికిరణ్ వైసీపీ ఉద్యోగి అని చెప్పింది అదే ఛానెల్ ఫోన్ ఇన్ లో ! ఏంటి… ఫోన్ ఇన్ చెప్పమని కూడా పోలీసులే బెదిరించారా ? తెలివితేటలు కాకపోతే ! ఇలా విచ్చలవిడి తెలివితేటలు ప్రదర్శిస్తున్న మధుసూదనరెడ్డికి అనుకోని దెబ్బపడింది పోలీసు ప్రశ్నలతో ! రవి కిరణ్ మీ ఆఫీసులో వాడుతున్న సిస్టమ్ నుంచి కొన్ని ఆధారాలు మా దగ్గరున్నాయ్. దానికి కనెక్ట్ అయిన హార్డ్ డిస్క్ కూడా తీసుకురండి అందులో ఏముందో తెలిస్తే మీ సంగతి తేలిపోతుంది అని వార్నింగ్ లా చెప్పారు. అంతే గుండెల్లో రాయి పడింది.

ఇంతకీ హార్డ్ డిస్క్ దొరికితే ఏమవుతుంది ? అసలు రవి కిరణ్ మా ఉద్యోగి కాదు అని సాక్షి, వైసీపీ ఎందుకు బొంకుతున్నట్టు ? అక్కడే ఉంది అసలు సంగతి ‍!

– సాక్షి ఆస్తులు వ్యవహారాలు అన్నీ ఈడీ స్కానింగ్ లో ఉన్నాయ్. ఇలాంటి పంచ్ ల కోసం రాజకీయాల కోసం సాక్షి పేరుతో డబ్బులు ఖర్చుపెడుతున్నారని నిర్థారణ అయితే కేసుపై ప్రభావం పడుతుంది. కేసును ప్రభావితం చేసేందుకు రాజకీయం నడిపేందుకు సాక్షిని వాడుతున్నారన్న సీబీఐ వాదన నిజమని రుజువవుతుంది

– అసలే జగన్ కేసులో బెయిల్ రద్దుపై శుక్రవారం తీర్పు రాబోతోంది. ఇలాంటి సమయంలో కేసులు ఆధారాలు అంటే తలనొప్పి డబుల్ అయినట్టే ! అందుకే అసలు సంబంధమే లేదని తేల్చేస్తోంది.

– మే మొదటి వారంలో జీఎస్టీ కోసం అసెంబ్లీ సమావేశం కాబోతోంది. పనిలో పనిగా… రవికిరణ్ వ్యవహారంపై కూడా సభాహక్కుల ఉల్లంఘన కోణంలో చర్చ జరిగి… శిక్షపడే ఛాన్స్ ఉందంటున్నారు. అదే జరిగితే సోషల్ మీడియా పేరుతో అడ్డగోలు అరాచకాలు చేస్తున్నవాళ్లకి అడ్డుకట్టపడినట్టే ! అందుకే ఏం జరుగుతోందో తెలియని టెన్షన్ లో ఇపుడు జగన్ అండ్ కో కేవలం డినైల్ మోడ్ లో ఉన్నారు అంతే !

– అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి… వైసీపీ కేంపైన్ కుంటుపడింది. సోషల్ మీడియాలో విషం కక్కేందుకు వైసీపీ దాదాపు 80 మంది పెయిడ్ ఆర్టిస్టుల్ని వాడుతోంది. పోస్లులు పెట్టడం…కామెంట్లు చేయడం… ఎక్కడికక్కడ అరాచకం రేకెత్తించే వ్యాఖ్యలు చేయడం వీళ్లపని ! వీళ్లంతా ఇపుడు ఆత్మరక్షణలో పడ్డారు. రవికిరణ్ దొరికినట్టు దొరికిపోతే పీకల మీదకొస్తుందన్నా… పాస్ పోర్టులు రావు, వీసాల్లేవ్…ఉద్యోగాల్లేవ్ భవిష్యత్ పోతుంది అని వెనక్కి తగ్గుతున్నారు. ఇలాంటి వాళ్లకి ఏదోరకంగా కిక్ ఇచ్చేందుకు సాక్షి సవాలక్ష ప్రయత్నాలు చేస్తోంది.

మొత్తానికి ఇలా ఏ రకంగా చూసినా జగన్ అండ్ కో ఆట క్లైమాక్స్ కి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఏంటి ఈ మాత్రం దానికేనా అనుకోవచ్చేమో ! కానీ అదే అసలు సంగతి. రవికిరణ్ కేసులో చిన్న ఆధారం రుజువైనా… పడవకి చిల్లుపడినట్టు మొత్తానికే ముంచుతుంది. అందుకే వైసీపీ ఇపుడు గజగజలాడుతూ ఏ పక్క నుంచి ఏం ముంచుకొస్తుందా అని ఒణుకుతోంది. డైవర్ట్ చేసేందుకు సాయిరెడ్డి లాంటి వాళ్లు రంగంలోకి దిగి… రండి తేల్చుకుందాం అంటున్నారు పైకి మాత్రం ! ఇక తేల్చుకునేది లేదు నిజానికి, తేలాల్సింది మాత్రమే ఉంది !

Article Categories:
Anything Everything
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title