పీచు_మిఠాయి కేరాఫ్ పాలకొల్లు

Written by

పీచుమిఠాయి అంటే చాలామందికి కాటన్ క్యాండీ గుర్తొస్తుంది.ఈ కాటన్ క్యాండీ తయారీ మెషిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి,కాటన్ క్యాండీ వేరు ఒక కప్ షేప్ లో తయారు చేసే పీచు మిఠాయి వేరు.ఈరోజుకీ కట్టెల పొయ్యి మీద పాత పద్ధతులలో పీచుమిఠాయిని తయారు ఛేస్తున్నారు పాలకొల్లులోని కొంతమంది.

ఒక కుటీర పరిశ్రమగా దాదాపు 50 ఏళ్ళు గా ఈ పీచుమిఠాయిని తయారు చేసి, దేశం లోని చాలా రాష్ట్రాలకి ఎగుమతి కూడా చేస్తున్నారు పాలకొల్లు వాసులు.

పీచుమిఠాయి గా పిలిచే ఈ స్వీట్ ని కొన్ని ప్రాంతాల్లో పాపిడి అని కూడా పిలుస్తారు.పీచు_మిఠాయి తయారీకీ కేవలం కట్టెల పొయ్యి మాత్రమే ఉపయోగిస్తారు.

మైదా,పంచదార,డాల్డా ఉపయోగిస్తూ వివిధ ప్రక్రియల తర్వాత ఈ స్వీట్ తయారు అవుతుంది.నెయ్యితో కూడా చేస్తారు.ఒకవేళ మనకి నెయ్యి తో చేసిన పీచు మిఠాయి కావాలంటే మనం ఆర్డర్ ఇవ్వాలి.

ఇప్పటికీ పాలకొల్లు నుండి ఎవరైనా చుట్టాలు ఇతర ప్రాంతాలకి వెళ్తే వాళ్ళని ఈ స్వీట్ గురించి అడుగుతారు.ఈమధ్యనే అమలాపురం శివారు యానం రోడ్డులో పీచుమిఠాయి తయారు చెయ్యడం మొదలుపెట్టారు కానీ ఇంకా ప్రాచుర్యం పొందలేదు. హైద్రాబాద్ శిల్పారామం లో దొరికే పీచుమిఠాయి పాలకొల్లు నుండే ఎగుమతి అవుతోంది.

ఇవి రెండు రకాలుగా చేస్తారు.ఒకటి లూజ్ గా అంటే పొడి పొడిగా ఉంటుంది.రెండవది గిన్నెలు గా చిన్న గిన్నె షేప్ లో కొట్టి ఇస్తారు.కేజీకి సుమారు 36 గిన్నెలు వస్తాయి.40 సంవత్సరాల క్రితం ఈ స్వీట్ కేజీ 15 రూపాయలు.ఇప్పుడు దీని ఖరీదు 120/- కానీ వీరు పడే కష్టం ముందు చాలా తక్కువ.

Article Categories:
Anything Everything
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title