చిత్తూరులో అపొలోటైర్స్ తయారీ ఇండస్ట్రీ కి భూమి పూజ చేసిన బాబు

Written by

దేశం లోనే ప్రఖ్యాతిగాంచిన అపోలో టైర్స్,ఆంధ్రప్రదేశ్ లో తమ ప్రొడక్ట్స్ తయారీ కి తొలి అడుగువేసింది.18 వందలకోట్ల రూపాయల పెట్టుబడితో చిత్తూరు జిల్లాలో,పారిశ్రామిక ప్రగతికి చిహ్నం గా నిలిచిన సత్యవేడు శ్రీసిటీకి కి దగ్గరలో “చిన్నపాండూరు” వద్ద అపోలో టైర్ల పరిశ్రమ తన తయారీ యూనిట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది.

ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినదగ్గరనుండి రాష్ట్రం పారిశ్రామికం గా ఎదగడానికి అన్నిరంగాలలో తనదైన ముద్రవెయ్యడానికి అవసరమైన సౌకర్యాలని అందించడానికి తనవంతు కృషి చేస్తున్నారు.
ఈ క్రమం లోనే అపోలో టైర్స్ ఇండస్ట్రీ ఏర్పాటుకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
అపోలో పరిశ్రమ ఏర్పాటు కానున్న ప్రాంతం లో రాకపోకలనిమిత్తం సత్యవేడు-కడూరు మార్గంలో రూ.6 కోట్ల వ్యయంతో రోడ్డును కూడా వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.అంతర్జాతీయం గా పేరు తెచ్చుకున్న అపోలో టైర్స్ సంస్థకోసం 200 ఎకరాలని కేటాయించింది ప్రభుత్వం.

జనవరి 9,2018 న అపోలో టైర్స్ చైర్మన్ Onkar S Kanwar,ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులు పాల్గొన్న అపోలో టైర్స్ ఇండస్ట్రీ భూమిపూజ కార్యక్రమం లో పాల్గొని భూమిపూజ చేసి పునాది వేశారు చంద్రబాబు.
వచ్చే 6 నెలలలోపు పరిశ్రమ ఏర్పాటు చేసి, సంవత్సరానికి 5.5 మిలియన్ కార్ రేడియల్ టైర్స్ తయారు చెయ్యాలనే లక్ష్యం తో ఉంది అపోలో టైర్స్ సంస్థ.

ఈ సందర్భం గా అపోలో టైర్స్ చైర్మన్ మాట్లాడుతూ 5 సంవత్సరాలక్రితం పిసిఆర్ సెగ్మెంట్ లో చిన్న ఆటగాళ్ళం, ఇప్పుడు రెండవ స్థానానికి చేరుకున్నాం అని చెప్తూ 2016-17 వ సంవత్సరానికి గాను అపోలో టైర్స్ 39% అంటే మొత్తం 13,060 కోట్ల రెవెన్యూ పిసిఆర్ సెగ్మెంట్ లోనమోదైంది అని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో భూమి పూజ చేసుకుని ప్రారంభం కాబోతున్న అపోలో టైర్స్ సంస్థ ద్వారా ప్రత్యక్షం గా 700 మంది కి పరోక్షం గా మరింతమంది కి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కూడా చెప్పారు అపోలో చైర్మన్ “కన్వర్” అలాగే తమకి సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి కూడా కృతజ్ఞతలు తెలియచేసారు.

Article Categories:
Anything Everything
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title