చాగంటి కోటేశ్వరరావుకు ‘రామినేని” విశిష్ఠ పురస్కారం

Written by
అమెరికాకి చెందిన ప్రఖ్యాత డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ విశిష్ఠ, విశేష పురస్కారాలను వివిధ 
రంగాల్లో నిష్ణాతులైన నలుగురు తెలుగువారు సొంతం చేసుకున్నారు. ప్రముఖ ప్రవచన కర్త 
చాగంటికోటేశ్వరరావు,(విశిష్ఠ) చలన చిత్ర నటుడు కైకాల సత్యనారాయణ, నవలా రచయిత 
'అంపశయ్య'నవీన్‌, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సంచాలకురాలు సి.మృణాళినిరామినేని ఫౌండేషన్‌ విశేష పురస్కారాలు-2015కు ఎంపికయ్యారు. 

చాగంటి కోటేశ్వరరావు:చాగంటి కోటేశ్వరరావు పూర్తిపేరు చాగంటి రాజా వీర వేంకట కోటేశ్వరరావుపశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1958 జూలై 14వ తేదీన జన్మించారు. మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్‌ వద్ద సంస్క్రత భాషాధ్యయనం, కావ్యపఠనం అభ్యసించిన కోటేశ్వరరావు రామాయణ,
భాగవత,భారతాది గ్రంధాలపై కొన్ని వందల ప్రసంగాలు చేశారు. శివమహాపురాణం, కార్తీక 
మాసవైభవం,తిరుమల విశిష్ఠత,శంకర జీవితం, దుర్గా వైభవం, దేవీ నవరాత్రులు, 
దశావతారాలు, గోమాత వైభవం, కామాక్షీ వైభవం, శృంగేరీ జగద్గురు వైభవంపై కోటేశ్వరరావు 
చేసిన ప్రవచనాలు పుస్తకరూపంలో వచ్చాయి. కంచి కామటోటి పీఠంవారు 'ప్రవచన చక్రవర్తి", శృంగేరీ పీఠం వారు 'ప్రవచన రత్నాకర", శారదాపీఠంవారు 'శారదా జ్ఞానపుత్ర" వంటి 
బిరుదులతో అతనిని గౌరవించారు. సౌత్‌ ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీవారు 'శ్రీ చంద్రశేఖర 
సరస్వతి నేషనల్‌ ఎమినెన్స్‌ అవార్డు", రాష్ట్రీయ సంస్క్రత విద్యాపీఠంవారు 'వాచస్పతి" గౌరవ డాక్టరేట్‌, ఢిల్లీ తెలుగు అకాడెమీ వారు 'జీవన సాఫల్య పురస్కారం", విజ్ఞాన్‌ విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానంచేశారు. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్ధ కోటేశ్వరరావును ప్రముఖ 
ప్రవచన కర్తగా నమోదుచేసుకుంది. 

కైకాల సత్యనారాయణ: కృష్ణా జిల్లా కౌతారం గ్రామంలో 1935 జూలై 25వ తేదీన కైకాల 
సత్యనారాయణ జన్మించారు. గుడ్లవల్లేరులో పాఠశాల విద్య, గుడివాడలో కాలేజీ చదువు 
పూర్తిచేశారు. విద్యార్థి దశలోనే 'ప్రేమలీలలు" నాటకంలో మొదటిసారి ప్రతినాయకుడు పాత్ర 
వేసి  బంగారు పతకం సాధించారు. కాలేజీ విద్యార్థిగా ఉంటున్నపుడే 1954,55 సంవత్సరాల్లో 
నాటకాల్లో ఉత్తమ నటుడు పురస్కారాలను అందుకున్నారు. నటరాజ కళా సమితి, ప్రభాకర 
నాట్య మండలి సంస్ధల్లో క్రియాశీలకంగా పనిచేసిన సత్యనారాయణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోపల్లెపడుచు,కులంలేని పిల్ల, బంగారు సంకెళ్లు, ఆడది, సుల్తాన్‌ నాటకాల్లో నాయక పాత్రలో రక్తికట్టించారు. ప్రఖ్యాత నాటకవేత్త డాక్టర్‌ గరికపాటి రాజారావు ఎన్టీయార్‌ పోలికలు ఉన్న 
సత్యనారాయణను సినిమాల్లో ప్రయత్నించమని ప్రోత్సహించారు. నిర్మాత డి.ఎల్‌.నారాయణ 
నిర్మించిన 'సిపాయి కూతురు"లో సత్యనారాయణ హీరోగా నటించారు. 

ప్రముఖ దర్శక నిర్మాత విఠలాచార్య ప్రోత్సాహంతో సత్యనారాయణ ప్రతి నాయకునిగా ఎదిగారు.అటు తరువాత అయిదు దశాబ్దాలపాటు పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించారు. మిత్రులు, తమ్ముడు సహకారంతో మామా అల్లుళ్ల సవాల్‌, ఇద్దరు దొంగలు,అడవిరాజు, చిరంజీవి, కొదమసింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలను నిర్మించారు. నందమూరి తారకరామారావు అత్యంత సన్హితుడైన సత్యనారాయణ 
తెలుగుదేశంపార్టీలో కీలక పాత్ర పోషించి, 1996లో పార్లమెంట్‌ మచిలీపట్నం సభ్యునిగా
గెలుపొంది నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారు. నవరస నటనా సార్వభౌమగా చలన చిత్ర 
జగత్తులో ప్రసిద్ధమైన సత్యనారాయణను చిత్తూరు నాగయ్య, ఎన్టీఆర్‌ స్మారక పురస్కారాలతో 
సాంస్క్రతిక సంస్ధలు సత్కరించాయి. 

'అంపశయ్య" నవీన్‌: తెలంగాణా సూర్యాపేట వద్దగల మద్దిరాలలో 1941 డిసెంబర్‌ 24వ తేదీన జన్మించారు. నవీన్‌ విద్యాభ్యాసం వావిలాల,తిర్మలగిరి, వరంగల్‌లో సాగింది. హైదరాబాద్‌ 
ఉస్మానియా యూనివర్సిటీలో అర్థశాస్త్రంలో ఎం.ఎ. పట్టా పొందారు. అర్థ శాస్త్ర ఉపన్యాసకునిగా 1964లో కెరీర్‌ ప్రారంభించిన నవీన్‌ నల్గొండ,కరీంనగర్‌, భద్రాచలంలో పనిచేసి, 1995లో పదవీవిరమణచేశారు. చిన్నతనం నుండే సాహిత్యంపై మక్కువ కలిగిన నవీన్‌ హైస్కూల్‌ చదువుతున్నపుడే ఓ లిఖిత పత్రికకు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. కళాశాలలో జరిగిన కథల 
పోటీలకు 1959లో 'చితికిన జీవితం" అనే కథను పంపగా, ఆ కథ ఉత్తమ బహుమతిని 
గెలుచుకొని ఇన్‌హౌస్‌ పత్రిక 'జ్యోతి"లో ప్రచురితమయింది. 

చైతన్య స్రవంతి (స్ట్రీమ్‌ ఆఫ్‌ కాన్షస్‌నెస్‌) శిల్పంలో 1969లో నవీన్‌ రాసిన 'అంపశయ్య"నవల తెలుగు సాహితీ ప్రపంచంలో విశిష్ఠ స్ధానాన్ని సాధించింది. ఈ విధంగా ప్రాచుర్యంలోనికి 
రచయితగా వచ్చిన నవీన్‌ను నాటి నుంచి 'అంపశయ్య" నవీన్‌గా పిలవడం పరిపాటి 
అయిపోయింది. నవీన్‌ ఇప్పటి వరకూ 31 నవలలు, 80 కథలు, వందకుపైగా పుస్తక సమీక్షలు,అనేక విమర్శనా వ్యాసాలు రాశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో నవీన్‌ ప్రస్తుతం కాలమిస్ట్‌గా 
కొనసాగుతున్నారు. అనేక జాతీయ, 

అంతర్జాతీయ చలన చిత్రాలపై నవీన్‌ విశ్లేషణలు రాశారు. నవీన్‌ రాసిన 'కాలరేఖలు" నవలకు2004లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. మిత్రులతో కలిసి నవీన్‌ 1977లో 
'కరీంనగర్‌ ఫిల్మ్‌ సొసైటీ"ని స్ధాపించారు. ఉత్తమ తెలుగు చిత్రాలకు నంది బహుమతులను 
అందించే జ్యూరీ కమిటీలో సభ్యునిగా 2001,2011లో వ్యవహరించారు. 

మృణాళిని:డాక్టర్‌ సి.మృణాళిని 1957లో జన్మించారు. కావలి, తిరుపతి, విశాఖపట్నంలో 
విద్యాభ్యాసం సాగించిన ఆమె తెలుగులో ఎం.ఎ.,ఎం.ఫిల్‌.,పి.హెచ్‌.డి.చేశారు. ఆంగ్లంలో 
ఉమెన్‌ స్టడీస్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ 
విద్యాలయంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  సాంఘిక నవలలో కథన శిల్పం అనేఅంశంపై మృణాళిని పి.హెచ్‌.డి.చేశారు. ఆమె రాసిన 'కోమలి గాంధారం", 'తెలుగు 
ప్రముఖుల చమత్కార భాషణలు" పుస్తకాలు హాస్యప్రియులను గొప్పగా ఆకట్టుకున్నాయి. 
ప్రతిధ్వని, నిశ్శబ్ద విప్లవాలు, ఇతిహాసం, సకల వంటి పుస్తకాలను ఆమె ప్రకటించారు. 

రాబిన్‌ శర్మ రాసిన ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస పుస్తకాలను మృణాళిని తెలుగులోనికి అనువదించారు. యు.ఎస్‌., చైనా, మారిషస్‌, మలేసియా, నార్వే తదితర దేశాల్లో పలు సాహితీ గోష్ఠుల్లోపాల్గొనిసిద్ధాంత పత్రాలను సమర్పించారు. ఆల్‌ ఇండియా రేడియో, వరల్డ్‌ స్పేస్‌ తెలుగు చానెల్‌లో అనౌన్సర్‌గా, న్యూస్‌ రీడర్‌గా, ప్రోగ్రాం డైరెక్టర్‌గా పనిచేశారు. బెస్ట్‌ ఇన్నొవేటివ్‌ షో 
డైరెక్టర్‌గా 'వరల్డ్‌ స్పేస్‌ తెలుగు చానెల్‌ 'స్పందన"కు గాను 2008లో డాక్టర్‌ మృణాళిని జాతీయ అవార్డునుఅందుకున్నారు.  బీబీసీ తెలుగు రేడియో చానెల్‌ న్యూస్‌ రీడర్‌గా 1994 ఎన్నికలు సందర్భంగా వ్యవహరించారు. దూరదర్శన్‌తోపాటు పలు తెలుగు చానెల్స్‌లో 2000పైగా కార్యక్రమాలను నిర్వహించిన ఘనత మృణాళిని సొంతం. యద్దనపూడి సులోచనారాణి, వాసిరెడ్డి సీతాదేవి, 
అబ్బూరి చాయాదేవి, తురగా జానకీరాణి పేర్లతో అందించే పురస్కారాలను మృణాళిని 
అందుకున్నారు. 

రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రామినేని ఫౌండేషన్‌ పురస్కారాలను విశాఖపట్నంలో ప్రకటించారు. ఈనెల 12వ తేదీన నగరంలో జరిగే కార్యక్రమంలో పురస్కారాల 
ప్రదానం జరగనుంది.
Article Categories:
News
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title