గుంటూరు లో చెత్త కూడా బంగారమేనా!

Written by

రాజధానికి కేంద్రంగా మారిన గుంటూరులో ప్రతీ అడుగు విలువైందే. సెంటూ భూమి కోట్లతో సమానం. ఇక భవనాలు, ఇళ్లు సంగతి చెప్పక్కర్లేదు.మరి చెత్త సంగతేంటి. అవును చెత్తే ఎందుకు పనిరాదని పడేసే చెత్త కూడా ఇప్పుడు గుంటూరులో విలువైంది కాబోతోంది. గుంటూరులో చెత్త ఆధారిత విద్యుదుత్పత్తి ప్రాజెక్టుకు జిందాల్‌ కంపెనీతో ఒప్పందం కుదిరింది. విజయవాడ, గుంటూరు సహా 7 మున్సిపాలిటీల నుంచి చెత్తను సేకరించబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ లో రూ.150కోట్లతో నిర్మించే ఈ ప్లాంట్ ద్వారా 15 మెగావాట్ల కరెంటు తయారు కాబోతోంది. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు పూర్తి కాబోతోంది. ఇక నుంచి ఇంట్లో నుంచి బయటకు పడేసే చెత్త గుంటూరు పరిసర ప్రాంతాలకు కొత్త వెలుగులు ఇవ్వబోతోంది.

Article Categories:
More
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title