గన్నవరం టూ ముంబై రెండుగంటల్లో..

Written by

ఆంధ్రప్రదేశ్ విజయవాడ సమీపం లోని గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ముంబయికి రెండు గంటల్లో చేరేందుకు వీలుగా విమాన సర్వీసు ప్రారంభమయ్యింది.ఈ విమాన సేవలను కేంద్రం పౌరవిమానయాన శాఖ మంత్రి “అశోకగజపతిరాజు” ఈ ఉదయం ప్రారంభించారు.

రాజధాని అమరావతి రాకపోకలకు వీలుగా,ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఎయిరిండియా బోయింగ్‌ 737-800 విమాన సేవలను ప్రారంభించింది.త్వరలోనే ఈ సర్వీస్ ను దుబాయ్ దాకా పొడిగిస్తారు.

ప్రస్తుతం వారానికి మూడురోజులు అంటే శుక్ర,ఆది,మంగళవారాలలో ఈ సర్వీసు నడుస్తుంది.రద్దీని బట్టి రోజూ సర్వీస్ ఉండే అవకాశం ఉంది.ఇప్పటికే గన్నవరం నుండి ఢిల్లీ,హైదరాబాద్‌,విశాఖ,బెంగళూరు,చెన్నై నగరాలకు విమాన సౌకర్యం ఉంది.ఇప్పుడు ముంబయి కి కూడా మొదలయ్యింది.

ముంబై నుండి ప్రపంచ దేశాలకి విమాన సర్వీస్ ఉంది.ఆంధ్రప్రదేశ్ నుండి విదేశాలకి వెళ్ళేవారికి ఈ ముంబై సర్వీస్ మొదలవడం వలన ప్రయాణం మరింత సులభం అవుతుంది.

Article Categories:
Anything Everything
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title