క్రిష్ణా జిల్లా 150 ఏళ్ల కిందట ఇలా ఉండేది తెలుసా ?

Written by

బెజవాడ కంటే బందరు నాలుగు రెట్లు పెద్దది. క్రిష్ణా జిల్లాలో రెండో అతిపెద్ద పట్టణం గుంటూరు. జగ్గయ్య పేట కూడా పెద్దదే ! చీరాల – బెజవాడ స్థాయిలో కాస్త అటూ ఇటుగా ఉండేవి ! ఏంటి ఎప్పటివి ఈ లెక్కలు అనుకుంటున్నారా ? 150 ఏళ్ల కిందటి ఆధారాలను అక్షరాలా మీ ముందుకు తెస్తోంది కోస్తా లైఫ్ !

1871 జనాభా లెక్కల ప్రకారం… క్రిష్ణా జిల్లా మొత్తం జనాభా 15 లక్షల 48 వేలు. ఆడ, మగ సంఖ్యలో పెద్దగా తేడా లేదు. పైగా మహిళా జనాభాలో పెరుగుదల పురుషుల కన్నా మెరుగ్గా ఉంది. అంటే శాతకర్ణి సినిమాలో చెప్పినట్టు, అప్పట్లో వివక్ష లేదు. మహిళలు కాస్త మెరుగ్గా, మందున్నారు. పైగా మతాల వారీగా చూసుకుంటే బందరులాంటి చోట్ల 90 శాతం హిందువులుంటే … తర్వాత ముస్లిం జనాభా ఉంది. క్రిస్టియానిటీ అప్పుడప్పుడే పెరుగుతున్నట్టుగా ఉంది. వివరాలు కింద డాక్యుమెంట్ లో ఉన్నాయ్ చూడండి !

క్రిష్ణా జిల్లాలో రెండో అతిపెద్ద పట్టణం గుంటూరు. జగ్గయ్య పేట కూడా పెద్దదే !

క్రిష్ణా జిల్లాలో రెండో అతిపెద్ద పట్టణం గుంటూరు. జగ్గయ్య పేట కూడా పెద్దదే !

క్రిష్ణా జిల్లాలోనే కాదు మన కోస్తా ప్రాంతంలోనే అతి పెద్దపట్టణం బందరు. కాస్త అటూఇటుగా బందరు కన్నా పెద్ద ఊరు అని చెప్పుకో దగినది ఒక్క మద్రాసే అప్పట్లో ! 1864లో ఉప్పెనొచ్చి 30 వేలమంది కొట్టుకుపోయాక సగం మందే మిగిలారు జనాభా ! అయినా బందరు బెజవాడ కన్నా జనాభాలో నాలుగు రెట్లు పెద్దది. అంటే మామూలుగా అయితే బందరు మహానగరం అనుకుంటే బెజవాడ అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న ఊరులా ఉండేదనమాట ! పైగా జిల్లా పొడుగు కూడా నిజాం పట్నం వరకూ ఉంది చూడండి ! ఇప్పుడున్నంత పరిపాలనా సౌలభ్యం లేదు. రాకపోకలకి గుమ్మం కూడా బందరే ! అడ్మినిస్ట్రేషన్ అంతా అప్పట్లో మద్రాస్ రాష్ట్రం కింద ఉండేది ! పైగా
అప్పుడపప్పుడే బ్రిటీష్ ఊడలు దిగిన ఛాయలు కనిపిస్తున్నాయ్ కాబట్టి కోస్తా ప్రాంతంలోనే డెవలప్ మెంట్ కనిపించేది !

మొత్తానికి ఇదంతా చూస్తుంటే 150 ఏళ్లనాడు ఇదనమాట సంగతి అనిపిస్తోంది. అప్పట్లోనే మున్సిపాలిటీగా ఓ వెలుగు వెలిగింది కాబట్టి బందరులో ఆ పునాదులు ఇప్పటికీ కనిపిస్తాయ్. కాకపోతే ఇప్పటికీ అక్కడే ఆగిపోయామన్నది ఒక్కటే వెలితి. పోర్టులాంటివన్నీ మళ్లీ వస్తే… ఆ నాటి వైభవాన్ని మళ్లీ తెస్తాయేమో చూద్దాం మరి !

Article Categories:
Anything Everything
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title