కోస్తాలో వచ్చే వేసవి జాగ్రత్త

Written by

ఉక్కపోత, చెమటలు కోస్తా జిల్లాల్లో ఏమూలన ఉన్న వ్యక్తికైనా అలవాటైన వాతావరణం. అందులోను వేసవి కాలంలో కోస్తాలో సూరీడు నిప్పులు మనోళ్లకు అలవాటే. ఎంత ఎండనైనా తట్టుకోగల కెపాసిటీ కూడా ఉంది. ఇప్పుడు ఈ కెపాసిటీ పెంచుకోవాల్సిన టైమొచ్చేసింది. శివరాత్రి రాక ముందే ఎండల తీవ్రతలో మార్పు కనిపిస్తోంది. రాత్రిళ్లు చలిగాలులు పగలు వేడిగాలులతో వాతావరణం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పది రోజుల్లోనే పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. అన్నింటికి మించి వచ్చే వేసవిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కోస్తా,సీమలో టెంపరేచర్స్ లో 40 డిగ్రీల మార్కు దాటి 50కి చేరినా ఆశ్చర్చపోవక్కర్లేదని సిగ్నల్స్ ఇస్తోంది. ఇప్పటికే వేసవికాలాన్ని తలపిస్తున్న ఎండలు చూసి అదిరిపోతున్నవారు గుండెను ఇంకాస్త గట్టిగా పట్టుకుని పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధం కండి.

Article Categories:
More
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title