“కలంకారీ” అంటే గుర్తొచ్చే శీకాళహస్తి,మచిలీపట్నం

Written by
కలంకారీ డిజైన్స్ తెలీనివారుండరు.కలంకారీ వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఒక కళ.

కలంకారీ డిజైన్స్ తెలీనివారుండరు.కలంకారీ వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఒక కళ.’కలంకారీ’ అనే పదంలో ‘కలం’అంటే పెన్ను,కారీ’ అంటే రాసే వ్యక్తి.స్వచ్చమైన రంగులతో,అద్భుతమైన డిజైన్స్ తో నిండి ఉండే ఈ కలంకారీ కళ సంప్రదాయమైనది పైగా శ్రమతో కూడినది.కళాత్మకమైన ఈ కలంకారీ కళ ఇప్పుడూ చాలామందికి ఉపాధిమార్గాన్ని చూపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి,కృష్ణాజిల్లా మచిలీపట్నం దగ్గరలోని ‘పెడన’లో మాత్రమే ఈ కలంకారీ కళాకారులున్నారు.’పెడన’ కలంకారీ అద్దకాలకు కేంద్రస్థానమైతే,భగవంతుని బొమ్మలకు శ్రీకాళహస్తి ప్రసిద్ధి.

ఒకప్పుడు కలంకారీకి ఆదరణ చాలా తక్కువగా ఉండేది.ఇప్పుడూ అందరూ ఆసక్తి చూపడం తో అమ్మకాలు బాగా పెరిగాయి.కాళహస్తిలోనే 1500 మంది పైగా మహిళలు కలంకారీ యూనిట్లు నిర్వహిస్తున్నారు.

అసలు కలంకారీ ప్రింట్స్ ఎలా తయారు చేస్తారో చూద్దాం..

దళసరిగా ఉండే చేనేత బట్టను తీసుకుని,బట్టకు పెట్టిన గంజిపోయేదాకా నాలుగైదుసార్లు సబ్బు,డిటర్జెంట్లు ఉపయోగించకుండా శుభ్రం చేస్తారు.తరువాత పాలు,కరక్కాయల రసంకలిపిన మిశ్రమంలో బాగా ముంచి ఎండలో ఆరబెడతారు, తర్వాత చింతబొగ్గుతో తయారైన బొగ్గు కణికెలతో ఈ బట్ట మీద హస్తకళానైపుణ్యంతో చిత్రాలను చిత్రిస్తారు.

ఇదివరకు రోజుల్లో కలంకారీ అద్దకాన్ని ఒకప్పుడు నూలు బట్టల మీద మాత్రమే అద్దేవారు.ఇప్పుడు టస్సర్,క్రేప్,సిల్క్ వస్త్రాల మీద కూడా వేస్తున్నారు.ఒక సన్నని వెదురు బద్దతో కలం చేసి దాని చివరలో పాయింట్‌గానీ,బ్రష్‌గానీ తయారు చేస్తారు.ఈకలంలో ప్రత్యేకంగా తీయబడిన దారి నుండి సిరా ప్రవహిస్తుంది.రంగులను సహజంగా లభించే మూలికల నుండి తయారుచేస్తారు.
కలంకారీ కళమీద ఆసక్తి ఉండి నేర్చుకోవాలనుకునేవారికోసం “శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రడిషినల్ స్కల్‌ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ “(SVITSA)కలంకారీ చిత్రాలు” అనే కోర్సును ప్రవేశపెట్టింది.

శ్రీకాళహస్తి కి చెందిన ‘శ్రీ రామచంద్రయ్య’ కలంకారీ కళలో చూపించిన ప్రతిభకు గానూ గిన్నిస్ రికార్డును పొందారు.
కలంకారీ డిజైన్స్ దేశవిదేశాల్లో మంచిపేరు తెచ్చుకున్నాయి.ఆన్ లైన్ లో కూడ కలంకారీ చీరలని, మెటీరియల్ ని అమ్ముతున్నారు కలంకారీ వ్యాపారులు.ప్రాచీన కళకి కొత్తరూపు ఇచ్చి కలంకారీకీ డిమాండ్ ని పెంచిన కళాకారులని అభినందించి తీరాలి..

Article Categories:
Anything Everything
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title