ఐటీ పార్క్ గా మారుతున్న మంగళగిరి

Written by

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం సన్రైజ్ ఆంధ్రప్రదేశ్,సాంకేతికం గా పారిశ్రామికం గా అభివృద్ధి సాధించే దిశ లో కృషి చేస్తోంది.ఈ క్రమం లోనే రాష్ట్ర రాజధాని సమీపం లోని మంగళగిరిని, మైటెక్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.

మంగళగిరి ఎన్‌ఆర్‌టీ టెక్‌ పార్కు, ఆటోనగర్‌ ఐటీ పార్కు ఈ రెండిటిలోనూ ఈరోజు ఐటీ శాఖామంత్రి లోకేష్, 16ఐటీ కంపెనీలను ప్రారంభిస్తున్నారు.ప్రారంభించిన అనంతరం 600 మందికి ఉపాధి కల్పిస్తూ,ఇదే సంవత్సరాంతానికి మరో 1600 మందికి ఉద్యోగావకాశాలు అందిస్తామని ఈ సంస్థలు ధీమా వ్యక్తం చేశాయి.
ఐటీ రంగం కాబట్టి ఇక్కడ పనిచేసే ఉద్యోగుల భద్రతకోసం ప్రత్యేక పోలీసు పెట్రోలింగ్‌ కూడా ఏర్పాటు చేసారు.
ప్రారంభం అయ్యే సంస్థల వివరాలు..

సిగ్నం డిజిటల్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, చారువికెంట్ ఐటీఈఎస్ ప్రైవేటు లిమిటెడ్, అద్వైత్ అల్గారిథం, స్క్రిప్ట్ బీస్, స్వరా సాఫ్ట్, సన్ స్వెట్, పిక్సీ,సాత్వికా,ఆస్థానా ప్రైవేట్ లిమిటెడ్,క్రేజీ టూంజ్ యానిమేషన్ స్టూడియో,మహాత్రూ మీడియా సొల్యూషన్స్ ,సువిజ్, డీఎఫ్ఐ స్విస్, ఎక్సెల్లార్, మేక్ మై క్లినిక్, బీవీజీ ఇండియా కంపెనీలు ఉన్నాయి..
ఇందులో మూడు స్టార్ట్ అప్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో మేక్ మై క్లినిక్, ఎక్సెల్లార్, బీవీజీ ఇండియా కంపెనీలు పైకేర్ ఐటి పార్కులో ఏర్పాటు అవుతున్నాయి. మిగతా 13 కంపెనీలు ఎన్ఆర్టీ ఐటీ పార్కులో వస్తున్నాయి.

Article Categories:
Anything Everything
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title