“ఏపి ఫైబర్ గ్రిడ్ తో కలిసి పనిచేయనున్న “Google X”

Written by

అమెరికాలో తప్ప ఎక్కడా లేని “గూగుల్ ఎక్స్” ఇప్పుడు విశాఖపట్నం లో తన డెవెలప్ మెంట్ సెంటర్ ని ప్రారంభించనుంది..ఈమధ్యనే ఆంధ్రప్రదేశ్ IT శాఖమంత్రి నారా లోకేష్ ఆధ్వర్యం లో డెవలెప్ సెంటర్ ఏర్పాటు ఒప్పందం తోపాటు ,ఫైబర్ గ్రిడ్ తోకలిసి Free space optical communication లింక్స్ ని,గూగుల్ ఎక్స్ ఏర్పాటు చేయనుంది..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా ప్రారంభించిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్..149 రూపాయలకే టివి చానల్స్,ఇంటర్నెట్,మొబైల్ సేవలు మూడింటిని అందిస్తోంది.సాంకేతిక, సమాచార రంగాలలో తనదైనముద్ర వేయనుంది ఫైబర్ గ్రిడ్.

గూగుల్ ఎక్స్,ఫైబర్ గ్రిడ్ కలిసి కుదుర్చుకున్న ఈ MOU పై ఏపీ ఐటీ శాఖ అధికారులు, గూగుల్ ఎక్స్ సీఈవో “ఆస్ట్రో టెల్లర్” సంతకాలు చేశారు.అంటే దాదాపు ఏపీ లోని 13 జిల్లాలలో,ఫైబర్ కేబుల్ ఏర్పాటు చెయ్యలేని ప్రాంతాలలో కూడా మొబైల్ డేటా, వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి .

ఫైబర్ గ్రిడ్,గూగుల్ ఎక్స్ కలిసి 20 GBPS వేగంతో 20 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ ని అందించగల అధునాతన టెక్నాలజీని ఉపయోగించనున్నాయి.

ఇప్పటికే విద్యుత్ స్తంభాలమీద ,అపార్ట్ మెంట్స్ పైన 23 వేల కిలోమీటర్లపైనే ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ కేబుల్స్ ని ఏర్పాటు చేసే అవకాశం లేదు.అలాంటి ప్రాంతాలలో కూడా గూగుల్ ఎక్స్ తో, కలిసి పనిచేయనుంది ఫైబర్ గ్రిడ్.

Article Categories:
Anything Everything
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title