ఎందుకీ విష ప్రచారం… నిజం తెలుసుకోండి

Written by

తెలుగు మీడియా ఇప్పటికే జర్నలిజం విలువలని పక్కన పెట్టేసి బతుకిడుస్తుంది. కాస్తాంత అయిన విషయ పరిజ్ఞానం లేకుండా ఆసలైన నిజాలను బయటకు తీయకుండ పది మంది కలిసి సృష్టించిన వార్తను పదే పదే ప్రసారం చేస్తూ పబ్బం గడుపుకుంటూన్నాయి మీడియా హౌసులు. ఇదంతా ఎందుకంటే మొన్న జరిగిన గోదావరి పుష్కరాల విషాద సంఘటనకి చంద్రబాబే కారణం అంటూ కొన్ని చానళ్ళు ఇప్పటికి ప్రసారం చేస్తున్నాయి. ఆ రోజు బోయపాటి చంద్రబాబుపై ఎదో డాక్యుమెంటరీ తీసాడంటూ.. అందువలనే అక్కడ రెండు గంటలు ఆలస్యమవడంతో జనం ఒక్కసారే ఘాట్ కి రావడంతో తొక్కిసలాట జరిగినట్టు రకరకాల కథలు అల్లింది తెలుగు మీడియా . అయితే ఈ కథకు మూలం మాత్రం ప్రతిపక్షాలే… సరే ప్రతిపక్షం అంటేనే ప్రతి చిన్న విషయాన్ని వారి ఉనికి కోసం వాడుకుంటుంది … మరి మీడియా అలా కాదు కధ! మినిమం శోదన చేయ్యాలి ..ఆసలు విషయానికి వద్దాం ..

ఆ ఘటనపై తాజాగా డైరెక్టర్ బోయాపాటి శ్రీను కొన్ని విషయాలు చెప్పాడు.. ఆసలు ఆ రోజు ఎలాంటి షూటింగ్ జరగలేదని, తనను చంద్రబాబు నాయుడు గారు గోదావరి హారతిని హైలేట్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాడానికి పిలిపించారని చెప్పాడు.. అయితే బోయపాటి మాటలు నిజమా ,కాదా చూద్దాం.. ఆసలు అక్కడ ఉన్న ఫోటోలని జాగ్రత్తగా గమనిస్తే బోయపాటి చెప్పడం కాదు మనకే అర్ధమవుతుంది.

proofs

ముందు మీడియా ప్రసారం చేసిన ఫోటో చూద్దాం.. అక్కడ చంద్రబాబు గారు ఆయన సతీమణి కాగాడా తో హరతిని వెలిగిస్తున్నారు. ఇక్కడ వస్త్రాదారణ కూడా గమనించండి.. చంద్రబాబు ప్యాంట్, షర్ట్ తో భువనేశ్వరి గారు చీరలో ( ఆ చీర కలర్ కూడా చూడండి). పక్కన బోయపాటి మైక్ తో ఎదో చెబుతున్నట్టూ ఉంది.. ఈ సీన్ పుష్కరం మొదలవ్వటానికి ముందు రోజుది. దీనినే ఇప్పుడు తప్పుడు ప్రచారంలో పెట్టారు. మరి పుష్కర ప్రారంభం రోజుది కూడా గమనిస్తే ఆసలు విషయం అందరికి అర్ధమవుతుంది. రెండో రోజు అంటే ఘటన జరిగిన రోజు చంద్రబాబు , భువనేశ్వరిలు పుష్కర స్నానం చేసే టప్పుడు, చేసి వచ్చాక ఒడ్డున ఉన్న ఫోటో చూడండి.. ఇక్కడ చంద్రబాబు పంచెలో ఉన్నారు. భువనేశ్వరి గారి చీర రంగు కూడా మారింది.. దీనిని బట్టి ఆసలు విషయం అర్ధమవుతుంది. కానీ ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా మీడియా అల్లిన కథనాలు చూస్తుంటే సిగ్గేస్తుంది..

Article Categories:
Anything Everything

Comments

Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title