ఇండియా మీద ఓడితే… ఇక గెలవడం కష్టం !

Written by

ఊహించలేనట్టుగా వచ్చి ఓడగొట్టేవాళ్లుంటారు. జెయింట్ కిల్లర్స్ అంటాం. అంచనాలతో వచ్చి అందుకునే వాళ్లుంటారు. ఛాంపియన్స్ వాళ్లు. ఈ రెండూ కాకుండా మరో టైపు కూడా ఉంది. టీమిండియా ! మామూలుగా గెలవరు. గెలిస్తే అట్టాఇట్టా ఉండదు అన్నట్టు తయారైంది ఇప్పుడు. మొన్న నంబర్ వన్ సౌతాఫ్రికాను నేలమట్టం చేసేశారు. మనతో ఆడిన తర్వాతే ఇంగ్లండ్ చేతిలో చిత్తు అయిపోయింది సఫారీ టీమ్. మన చేతుల్లో నాల్గు మ్యాచుల్లో వరసగా ఓడిన ఆస్ట్రేలియా ఇపుడు కోలుకోలేక డీలాపడింది. న్యూజీలాండ్ లో సిరీసే కాదు… పరవు కూడా పోగొట్టుకుంది. వరసగా రెండు టీమ్ లకి ఇలా జరిగే సరికి… దీన్ని ఇండియా సిండ్రోమ్ అంటోంది క్రికెట్ వరల్డ్

వాళ్లు ఓడితే మనోళ్ల గొప్పేముంది అంటారా ? అదే పాయింట్ ! సౌతాఫ్రికా ఫుల్ స్వింగ్ లో ఇండియా వచ్చింది. అదరగొడతామంది. కానీ… వరసగా ఓడిపోయే సరికి ఏం జరుగుతోందో తెలియని గందరగోళంలో పడిపోయింది. ఆసీస్ కూడా అంతే ! వాళ్లు మొదట నాల్గు మ్యాచుల్లో కాస్త తేడాతో గెలిచారు. తర్వాత నాల్గు మేచ్ లు భారీ తేడాతో ఓడారు. ఓడినా మనోళ్లు కాన్ఫిడెంట్ గా నిలబడ్డారు కానీ… మనోళ్లు చేతిలో తిన్న దెబ్బ వాళ్లని మాత్రం కోలుకోనివ్వలేదు. మానసిక నిపుణులు టీమ్ సపోర్టింగ్ స్టాఫ్ చెబుతున్నది ఇదే ! ఏ సిరీస్ కి ఆ సిరీస్ డిఫరెంట్. ఇపుడు ఇండియా సిండ్రోమ్ నుంచి బైటకి రండి అని కిర్ స్టెన్ లాంటి వాళ్లు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారంటే అర్థమవుతుంది… మనోళ్లు మ్యాచ్ లోనే కాదు ఆలోచనల్లోనూ గెలిచారని. కాన్పిడెన్స్ ని దెబ్బతీశారని !

అందుకే ఇపుడు ఇండియా మీద ఓడితే… ఇక గెలవడం మర్చిపోతారన్న సెంటిమెంట్ వరసగా రెండో టాప్ టీమ్ కీ బలపడింది. అనుకోకుండా… మనోళ్లు కూడా ఇపుడు ట్విట్టర్ లో జోకులు పేలుస్తున్నారు. మేం కొడితే అదోలా ఉంటదని తెలుసా అంటూ జడ్డూ లాంటి వాళ్లు పంచ్ లు విసురుతున్నారండోయ్ ! ఇదో రకంగా మంచిదే తొందర్లోనే టీ20 వరల్డ్ కప్. ఆస్ట్రేలియా సౌతాఫ్రికా లాంటి టీమ్ లను కోలుకోకుండా కొట్టినందుకు మనోళ్లకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే…అప్పుడు కొట్టిన దెబ్బ పెట్టుబడిలా పనికొస్తోందన్నమాట

Article Categories:
More
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title