అంగ‌న్‌వాడీ కేంద్రాలు ఇప్పుడు ఫ్రీ స్కూళ్ళు

Written by

అంగ‌న్‌వాడీ కేంద్రాల‌ను ప్రీస్కూళ్లుగా మార్చాల‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణ‌యించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్ల నిర్వహణపై రియల్ టైమ్‌లో ఆయన మాట్లాడారు.ఇందుకోసం అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. వీటి ద్వారా వేలాది మంది పిల్లల్ని ప్రయోజకులను చేసే అవకాశం అంగన్‌వాడీ సిబ్బందికి కలిగిందని సీఎం అన్నారు. సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటూ తల్లులను అంగన్ వాడీ ఉపాధ్యాయులు మర్చిపోయేలా చేస్తున్నారని ప్రశంసించారు. ఒక్కో ప్రీ స్కూల్ సెంటర్ కు రూ. 2.40 లక్షలు ఖర్చు చేస్తున్నామని, భవిష్యత్తులో ఈ సెంటర్లు మానవ వనరుల అభివృద్ధికి పునాది అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

aangan

Article Categories:
Anything Everything
Copy Protected by Chetan's WP-Copyprotect.
Menu Title