‘స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వలంటీర్ల జీవితం మారుస్తాం. వారు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదించుకునేలా చేస్తాం’ కుప్పం పర్యటనలో మంగళవారం యువతతో జరిగిన సమావేశంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి మాటలివి. ఆయన నోటి వెంట మళ్లీ స్కిల్ డెవలప్మెంట్ అనే పదం విని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయపడిపోతున్నారు. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్వాకాలు గుర్తొచ్చాయి కాబోలు.. శ్రీకాళహస్తి తెలుగుదేశం అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి వలంటీర్లను […]
స్కిల్ డెవలప్మెంట్ కేసును మంగళవారం ఏసీబీ కోర్టు విచారించనుంది. గతంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏ–1 అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఏ–22 నిందితుడు యోగేష్ గుప్తాది నిధుల అక్రమ తరలింపులో కీలకపాత్ర అని ఏ–13 నిందితుడు చంద్రకాంత్ షా పేర్కొన్నారు. ఈæ కేసులో ఏ– 26 నిందితుడు సావన్ కుమార్ జజూతో కలిసి యోగేష్ 2016లో తనని కలిశారని వెల్లడించారు. డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకు సాఫ్ట్ వేర్ […]
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవగా ఆయన హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన ఇచ్చిన ఈ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ బేం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ ప్రారంభమయ్యాక ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ […]
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సుప్రీం కోర్టులో తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం భిన్నమైన తీర్పు వెలువడింది. టీడీపీ వర్గాలు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావించగా వారికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏను ఈ కేసులో చంద్రబాబుకు అన్వయించే విషయంలో తమ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ప్రకటించారు. తగిన […]
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. సెక్షన్ 17 ఏ చట్టం వర్తింపు భవితపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు న్యాయ వ్యవస్థలో ఒక బెంచ్ మార్క్ కానున్న నేపథ్యంలో దేశంలో యావత్తు ఈ తీర్పు గురించి ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ సెక్షన్ ప్రకారం ముందుగా గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయకూడదు. కానీ […]
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు విచారణ జరిపింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం దర్యాప్తును సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు అప్పగించినా అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా దర్యాప్తును సీబీఐకి అప్పగించినా అభ్యంతరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా కౌంటర్ దాఖలు చేశారు. 2020లోనే […]