ఆ ఊరంతా సందడిగా ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఊరోళ్లు రావడంతో పండగ వాతావరణం నెలకొంది. నగరాలు, పట్టణాల్లో ఉంటునోళ్లు పల్లెబాట పట్టారు. విద్యుద్దీప కాంతులతో ప్రతి వీధి వెలిగిపోతోంది. వేరే రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్న అనిల్, కృష్ణ ఉత్సవాల కోసం ఆ ఉదయమే ఇంటికొచ్చారు. ఇద్దరూ మెయిన్ రోడ్డులోని టీ అంగడి దగ్గర కలిశారు. జీవితం ఎలా సాగుతుందో మాట్లాడుకుంటున్నారు. వారికి సమీపంలో కూర్చొన్న ఓ పెద్దాయన మరొకరితో ఆనందంగా చెబుతున్నాడు. […]
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంట సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు సీఎం జగన్ సాంప్రదాయ దుస్తుల్లో సతీ సమేతంగా పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్, భారతమ్మ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా గోశాల వద్ద భోగి మంటలు వేయటంతో పండుగ సంబరాలు మొదలయ్యాయి. అనంతరం జగన్, భారతమ్మ దంపతులు గంగిరెద్దులకు సారెను సమర్పించారు. అందరికీ మంచి జరగాలంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలో సీఎం […]