పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు మాత్రమే తీసుకున్నారు. దీనిపై అటు జనసైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కక్కలేక మింగలేక ఏడుస్తున్నారు. ఎవరైనా ఇలా జరిగిందేంటని అడిగితే అబ్బే మేము బాగున్నాం.. రాష్ట్రం కోసం త్యాగం చేశామని కవర్ చేసుకుంటున్నారు. 24ను 40కి పైగా స్థానాలుగా చూడాలన్న సేనాని వ్యాఖ్యలపై ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. ఇక పచ్చ గ్యాంగ్‌ను ఎప్పటికప్పుడు ఉతికి ఆరేసే సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అయితే […]
వ్యూహం సినిమా రిలీజు సంధర్భంగా ఈ రోజు ప్రసాదు ల్యాబ్సులో ప్రీమియర్ షో నిర్వహించారు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా తెరకెక్కింది. తన తండ్రి మృతి వలన ప్రాణాలు కోల్పోయిన వేలాది అభిమానులకు ఓదార్పు ఇవ్వడం కోసం చేద్దామనుకున్న యాత్రను సోనియాగాంధీ ఆపించాలనుకోవడం, అప్పటి ఆ పరిస్థితులను అధికారం కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబు, ప్రజల్లో పాపులారిటీ తెచ్చుకుంటున్న జగన్‌ను రాజకీయంగా […]
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటే తెలియని వారు ఉండరు. ఎన్నో సినిమాలతో దేశంలో సంచలనం సృష్టించిన ఆయన కొంతకాలంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపిస్తున్నారు. తనదైన శైలిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తెలుగు తమ్ముళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. శనివారం ఆయన చంద్రబాబు లక్కీ నంబర్ 23 అంటూ ట్విట్టర్ (ఎక్స్)లో పెట్టిన పోస్టు వైరలైంది. అందులో ఈ విధంగా రాసుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు […]
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమా రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. వ్యూహం చిత్రాన్ని పునః పరిశీలించి మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు నిపుణుల కమిటీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లోపు చిత్రానికి సంబంధించిన కొత్త సెన్సార్ సర్టిఫికెట్ జారీ విషయంలో నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది. దీంతో వ్యూహం రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వ్యూహం సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలంటూ టీడీపీ […]
రాం గోపాల వర్మ తల నరికి తెచ్చిచ్చిన వాడికి కోటి రూపాయలు ఇస్తానంటూ ఓ టీవీ ఛానెల్ డిబేట్ లో కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఎవరు ఇతను, ఒక వ్యక్తి తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తాననే తెంపరితనం ఎక్కడి నుండీ వచ్చింది. హత్యలు చేస్తే కోట్లు ఇచ్చే స్థాయి అతనికి ఉందా. చట్టాల్ని, వ్యవస్థల్ని తృణప్రాయంగా చూస్తూ బహిరంగంగా తలలు నరకమని ప్రోత్సాహించే ధైర్యం అతనికి ఎవరు […]
కొలికపూడి శ్రీనివాసరావు.. ఎల్లో మీడియా ఫాలో అయ్యేవారికి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షునిగా చెప్పుకునే కొలికపూడి శ్రీనివాసరావు ఎల్లప్పుడూ ఎల్లో మీడియా డిబేట్స్ లో ప్రభుత్వంపై విషప్రచారం చేయడమే లక్ష్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. చంద్రబాబు భజనతో పాటు శృతిమించిన వ్యాఖ్యలు చేయడం ఆయన నైజం. తాజాగా మరోసారి దర్శకుడు ఆర్జీవీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చేసి వార్తల్లో నిలిచారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సమాజానికి […]