జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినీ హీరోలు. వారికి అభిమానగణం ఉంది. ఇక తెలుగుదేశం యువరాజు నారా లోకేశ్.. ఈ ముగ్గురు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థులుగా ఎవరో రాజకీయ ఉద్ధండుల్ని పెట్టలేదు. మహిళామణులకు అవకాశం కల్పించారు. పిఠాపురంలో పవన్‌పై వంగా గీత, హిందూపురంలో బాలకృష్ణపై టి.నారాయణ దీపిక, మంగళగిరిలో లోకేశ్‌పై మురుగుడు లావణ్యను బరిలోకి దింపారు. దీంతో ఈ పోరు ఉత్కంఠగా మారింది. ఆ […]
సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ అసెంబ్లీ బరిలో నిలిచే విషయంలో అధిష్టానంపైనే కాలు దువ్వుతున్నాడు. విశాఖ ఉత్తరం నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు. భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని వారికి కేటాయించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో భరత్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. భరత్ గత ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ […]