కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ల గురించి మాట్లాడిన మాటలతో మనస్తాపానికి గురయ్యిన 384 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. మమ్మల్నీ చంద్రబాబు నాయుడు తన మాటలతో సొంత మీడియా అండతో అవహేళన చేస్తూ వస్తున్నారు. అసలు కుప్పంలో సొంత ఇళ్లు లేని చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలకు ప్రతి సెకను అందుబాటులో వుండే మమ్మలని అవమానపరుస్తున్నారు దానిని తట్టుకోలేక మేమంతా వాలంటీర్ల ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాము. రేపటి నుండి ప్రజలకు మా మీద టీడీపీ […]
జగన్ దెబ్బకు న్యూస్ ఛానెల్స్ లోనూ, సోషల్ మీడియా లో తప్ప గ్రౌండ్ లెవల్ లో తుడుచిపెట్టుకుపోయిన ప్రతిపక్షాలు, ఇప్పుడిప్పుడే తత్వం గ్రహించినట్లున్నాయి. అధికారం దక్కించుకోవడం కల్ల అని అర్థం అయినట్లు ఉంది, కనీసం తమ తమ స్థానాల్లో ఎమ్మెల్యే లు గా అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని బిక్కుబిక్కుమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కుప్పం లో చంద్రబాబు కు 2004 నుండి వరసగా మెజారిటీ తగ్గుతూ వస్తుంది. 2019 ఎన్నికల్లో కేవలం ముప్పై వేల ఓట్ల తో […]
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గత 30 సంవత్సరాలుగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రధాన ప్రతి పక్షనాయకుడిగా వున్నారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఈ ముప్పై సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు కుప్పంకు కృష్ణ నీళ్లు తీసుకురాలేకపోయారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన మొదటి విడతలోనే కుప్పంకు కృష్ణ నీళ్లు కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా తీసుకువచ్చి, కుప్పం నియోజకవర్గం మీద అక్కడి […]
హామీలు ఉండేవే మళ్లీ మళ్లీ ఇవ్వడానికి అని బలంగా నమ్మే చంద్రబాబు , తాను నెరవేర్చని అదే హామీని మళ్లీ మళ్లీ ఇవ్వడం షరా మామూలే.. ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్న బాబు నేడు రాప్తాడు లో ప్రచారం సందర్భంగా గోదావరి నీళ్లు రాయలసీమకి తీసుకొచ్చి మీ గొంతు తడిపే భాద్యత నేను తీసుకుంటా అని మళ్లీ మాటిస్తున్నా తమ్ముళ్ళు అనేశాడు.. మళ్లీ మాట ఇస్తున్న అనడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఎందుకంటే బాబు గతంలో […]
40 ఏళ్ల రాజకీయ చరిత్ర.. కుప్పం నుండి 7 సార్లు ఎమ్మెల్యే… తన రాజకీయ జీవితం లో ఎన్నడూ ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగిన పాపాన పోలేదు. మొదటిసారి ఎమ్మెల్యే గా పోటీ చేసినప్పుడు ఇందిరా గాంధీ హవాలో గెలిచినా, 1983 లో ఎన్టీఆర్ హయాం లో ఓడిపోయినా, 1989 లో నియోజకవర్గం మారి కుప్పం కు వెళ్లినా ఓటమి భయమే లేకుండా కులాసాగా కూర్చుని గెలిచిన బాబు కు తొలిసారి తన సీటే గెలుస్తానన్న నమ్మకం […]
‘దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నా వాల్లే వచ్చింది. హైదరాబాద్లో సైబర్ టవర్స్ కట్టించి ప్రపంచ పటంలో పెట్టా. నేను కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరగడం వల్లే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి. రాష్ట్రంలో ఎక్కువ మంది ఇంజినీర్లు ఉండడానికి కారణం నేనే. నేను చెప్పడంతోనే ఇక్కడ పరిశ్రమలు పెట్టారు. నన్ను చూసే బిల్గేట్స్ అంతటి వ్యక్తి వచ్చాడు. మీ పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే అది నా పుణ్యమే’ మైక్ దొరికితే చాలు తెలుగుదేశం […]
కుప్పం నియోజకవర్గం అనగానే అందరికి గుర్తుకు వచ్చేది చంద్ర బాబు నాయుడి కంచుకోటని. అలాంటి కంచుకోటలో ప్రస్తుతం బాబుకు ఓటమి భయంతో వణుకు పుడుతోంది. అది ఈరోజు కుప్పంలో చంద్రబాబు సభతో తేటతెల్లం అయింది. చంద్ర బాబు గత 40 ఏళ్లుగా కుప్పంను సొంత నియోజవర్గంగా చేసుకొని తన రాజకీయాలను రాష్ట్రమంతట చేస్తున్నారు. ఎప్పుడైతే వైఎస్సార్సీపీ పార్టీ పుట్టిందో ఆరోజు నుండి కుప్పంలో బాబుకు ఎదురీత మొదలు అయింది. 2014 లో కొద్దిగా తగ్గిన మెజారిటీ 2019 […]
తనని 7 సార్లు గెలిపించిన కుప్పం వాసుల కోసం ఏ ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోయినా, కనీసం ఒక నియోజకవర్గ ప్రధాన కేంద్ర స్థాయిలో కూడా అభివృద్ధి చేయకపోయినా మాఫియా కి మాత్రం అడ్డాగా కుప్పాన్ని మార్చాడు బాబు. మొదటిసారి సీఎం అవ్వగానే శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనం మీద దాని అక్రమ రవాణా మీద ముందునుండే కన్ను ఉన్న బాబు కుప్పాన్ని ఆ స్మగ్లింగ్ కు ప్రధాన కేంద్రం చేసి దేశవ్యాప్తంగా సరుకు రవాణాకు కేంద్రంగా మార్చాడు… […]
1978 నుండి వైఎస్ కుటుంబాన్ని ఆదరిస్తున్న పులివెందుల కోసం ఆ కుటుంబం అండగా నిలబడింది, అధికారంతో సంబంధం లేకుండా, ప్రభుత్వం తో పని లేకుండా సొంత నిధులతో అభివృద్ధి పనులు చేశారు… వైయస్సార్ 2007 లో తనకు విద్య నేర్పిన గురువు వెంకటప్పయ్య గారి పేరుపై 12 ఎకరాల సువిశాల ప్రాంగణం లో శ్రీ వెంకటప్పయ్య మెమోరియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ని పెట్టి, 2500 మంది విద్యార్ధులకు సరిపడేలా సదుపాయాలతో, ఎల్కేజీ నుండి పదో తరగతి […]
రాష్ట్ర ప్రతిపక్షనేత చంద్రబాబుకి కుప్పం భయం పట్టుకునట్టు ఉంది. సొంత నియోజకవర్గం కుప్పంలో రోజు రోజుకి పట్టు కోల్పోతున్నామేమో అనే కలవరపాటు ఆయనలో మొదలైనట్టు కనిపిస్తుంది. 35ఏళ్ళు కుప్పం ప్రజల ఓట్లని సంపాదించిన ఆయన కుప్పానికి కనీసం నీరు కూడా తీసుకుని రాలేకపోవడమే ఇప్పుడు ఆయనకి శాపంగా మారబోతుందనే ఆవేదన ఆయన చర్యలతోనే స్పష్టమవుతుంది. అందుకే చంద్రబాబు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి నీరు అందిస్తే సహించలేక తనకి బాగా అలవాటైన అసత్య ప్రచారాలనే ఆయుధాన్ని బయటికి తీసాడు. చంద్రబాబుకు […]