ఎక్స్ ప్రెస్ బయల్దేరింది… ఎక్స్ ప్రెషన్ మార్చండి…

Written by

ఇప్పుడంతా ప్రత్యేక హోదా మూడ్ కుదిపేస్తోంది. రాజకీయం దాని చుట్టే తిరుగుతోంది. ఢిల్లీలో సంప్రదింపులు, మీటింగ్ లు అన్నీ హోదా లేదంటే సాయం గురించే నడుస్తున్నాయ్. ఇలాంటి సమయంలో ఏపీకో గుడ్ న్యూస్. ఇది స్టేటస్ గురించి కాదు లెండి. కనెక్టివిటీ గురించి. విశాఖ టు ఢిల్లీ తిరిగే ఏపీ ఎక్స్ ప్రెస్ ఇవాల్టి నుంచే మొదలైంది. సురేశ్ ప్రభు పచ్చజెండా ఊపాక… కొత్త ప్రయాణం మొదలైంది. దాదాపు 2 వేల కిలో మీటర్ల జర్నీని కవర్ చేస్తూ ఏపీ ఎక్స్ ప్రెస్ తిరగబోతోంది. మొదట విజయవాడ టు ఢిల్లీ అనుకున్నా… బీజేపీ నాయకుల ఒత్తిడితో విశాఖ వరకూ పెరిగింది దూరం. ఏపీ ఎక్స్ ప్రెస్ రాష్ట్రాన్ని మాగ్జిమమ్ కవర్ చేసేలా ఉండాలని… ఇది సెంటిమెంట్ అంటూ హరిబాబు లాంటి నాయకులు మాట నెగ్గించుకోగలిగారు.

ఏపీ ఎక్స్ ప్రెస్ దువ్వాడ, అనకాపల్లె, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఏలూరులో ఆగుతుంది. ఆ తర్వాత విజయవాడ. మొత్తానికి మనకంటూ కొత్త ఏపీ ఎక్స్ ప్రెస్ రావడం సంతోషించాల్సిన విషయమే ! రైలు సంగతి సరే కానీ… ఇపుడు కేంద్రం అనే మాటొస్తే చాలు… హోదా ఏమైంది అని అడుగుతున్న ట్రెండ్ కనిపిస్తోంది ఏపీలో. రాజకీయం పుణ్యం. బడ్జెట్ లో ప్రకటించినట్టు ఏపీ ఎక్స్ ప్రెస్ ని కాస్త ఆలస్యంగా అయినా పట్టాలెక్కించినట్టుగానే సాయం విషయంలో కూడా కాస్త తేలిస్తే బావుంటుందన్న ఫీలింగ్ ఏపీది.

పనిలోపనిగా ఆ సంగతి కూడా చూస్తారా ? లేదంటే వచ్చేవారం చంద్రబాబు టూర్ నాటికి ఏమైనా తేలబోతోందా అనేది చూడాలి. పార్లమెంటు సమావేశాలు కూడా ముగిశాక… మోడీతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. హోదా విషయం తేల్చుకోవడంతోపాటు… మరోరెండు నెలల్లో జరగబోతున్న రాజధాని శుంకుస్థాపనకి ఆయన్ని ఆహ్వానించబోతున్నారు ముఖ్యమంత్రి. ఒక వేళ మోడీ అమరావతి రావాలంటే సాయం మాట చెప్పాల్సి ఉంటుంది. అంటే త్వరలోనే ఏపీకి కేంద్రం ఏం చేయబోతోందో తెలిసిపోతుందన్నమాట. అందుకే… ఇప్పటికైతే ఫీలింగ్ మార్చండి. ఎక్స్ ప్రెస్ వస్తోంది. హ్యాపీ జర్నీ చెప్పండి. అన్నట్టు ఏపీ ఎక్స్ ప్రెస్ స్పీడు రవ్వంత పెరిగింది. విశాఖ నుంచి ఢిల్లీకి 36 గంటలు పడుతుంది ఇక నుంచి.

Comments

comments

Article Categories:
News
Menu Title