తిరుమల  తిరుపతి దేవస్థానం  వారి అన్నప్రసాద సేవ  

Written by
Sri Venkateswara Annaprasadam Trust

                      “అన్నదానం  సమం దానం  త్రిలోకేషు న విధాతే “
వేదాలలోని ఈ వాక్యాలు అన్నదాన విషిష్టత  గురించి తెలియజేస్తున్నాయి.

అన్నం పరబ్రహ్మ స్వరూపం . మానవసేవే మాధవ సేవ అనే ప్రధానమైన ఉద్దేశంతో టి.టి.డి వారు 1984 లో ఈ బృహత్తరమైన  అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటిలో రోజుకి 2 వేల మంది భక్తులకు అన్నప్రసాదం ఉచితంగా  అందించేవారు. నేటికి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా, నిరాటంకంగా  నిర్వహిస్తున్నారు.

శ్రీ  వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్ :

ఏటా ఈ అన్నప్రసాదం  స్వీకరించే భక్తుల సంఖ్య  పెరుగుతూ వస్తోంది. ఈ అవసరార్థం టి.టి.డి. వారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేరు మీద అన్నప్రసాద  భవనాన్ని 2011వ  సంవత్సరములో  97000 చ.అ. విస్తీర్ణం లో నిర్మించారు. ఈ భవనం లో ఒక్క విడతలో  4 వేల మంది భక్తులకు అన్నప్రసాదం  అందించవచ్చు. అన్నం తో పాటు  రొట్టెలు కూడా అందిస్తున్నారు. అందుకు, గంటకు  2 వేల  రొట్టెలు తయారు   చేసే సామర్ధ్యం గల రొట్టెల తయారి యంత్రాన్ని కూడా టి.టి.డి వారు కొనుగోలు చేసారు. ప్రతిరోజూ ఈ భవనం లో 12 గంటలపాటు, దాదాపు 2లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తున్నారు.

ఇంతేకాకుండా,  దర్శనార్థం క్యూ  లైన్లలో వేచివున్న భక్తులకు టి.టి.డి. వారు పోట్లాలతో  అన్న ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.  శ్రీ పద్మావతి అమ్మవారి కోవెలలో కూడా  ప్రతి రోజు  దాదాపు  5వేల   మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. అలిపిరి నుండి కాలి నడకన కొండకు వచ్చే భక్తులకు కూడా నరసింహ స్వామి కోవెల వద్ద ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు.జనవరి 11 , 2014 నుంచి ప్రతి రోజు  శ్రీనివాసం  మరియు విష్ణు నివాసం  భవనాల వద్ద కూడా  10 వేల మంది భక్తులకు రోజుకి రెండు సార్లు అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వున్న భక్తుల, దాతల విరాళాలతోనే ఈ అన్నప్రసాదం ట్రస్ట్  నడపబడుతోంది.  కూరగాయలు కూడా  దాతల నుండి విరాళంగా ఈ ట్రస్ట్ కి లభిస్తున్నాయి.

“గజ తురగ సహస్రం గోకులం కోటి దానం
కనక రజిత పత్రం మేధిని సాగారాంతం
ఉపాయ కుల విశుత్తం కోటి కన్య ప్రదానం
నహి నహి బహుదానం అన్నదానం సమానం”

వేయి ఏనుగులు, గుర్రాల దానం కన్నా
కోటి గోవుల దానం కన్నా ,
పలు బంగారు వెండి పాత్రల దానం కన్నా,
సాగరం అంచుల వరకు ఉన్న భూ దానం కన్నా,
కోటి కన్యాదానాల  కన్నా అన్నదానం  గొప్పది,  సాటిలేనిది.

అన్ని దానాలకన్నా  గొప్పదైన  అన్నదానాన్ని చెయ్యండి,
ఆ  శ్రీవారి  కృప కు పాత్రులు కండి.

                             ఓం నమో వేంకటేశాయ నమః 

     మీనుశ్రీరామ్.
                                                            

Comments

comments

Article Categories:
My City · Tirupati

Comments

Menu Title