మా తల్లి గోదావరికి మహా పుష్కరాలు

Written by

జీవనది అయిన గోదావరి మహారాష్ట్ర లో ని త్రయంబకేశ్వర్ వద్ద నాసిక్ లో పుట్టింది. ఆ దక్షిణ గంగకు మహా పుష్కరాలు సమీపిస్తున్నాయి. ప్రతి  144 ఏళ్ళకు ఒకసారివచ్చే పుష్కరాలను మహాపుష్కరాలంటారు. జూలై 14 నుండి జూలై 25 వరకు ఈ మహాపుష్కరాలు జరగనున్నాయి. గోదావరి నది లో   స్నానం  ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవిక  అనే మూడు తాపాలను నశిమ్ప  చేస్తుంది . అపారమైన  ధారణ శక్తిని, జ్ఞాపక  శక్తిని ఇస్తుంది. రామాయణం, భారతం, భాగవతం ఇలా గోదావరి స్పర్శ  లేని  కావ్యం లేదు.   రామ చంద్ర  ప్రభువుకు గోదావరి ఇష్టం.  నన్నయ గోదావరి ఒడ్డున మహా  భారతాన్నిప్రారంభించారు.

పుష్కర విశిష్టత

గురుగ్రహం  ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నదిలో ప్రవేశించినప్పుడు మొదటి 12 రోజులు ఆది పుష్కరాలంటారు. బృహస్పతి (గురువు)  సింహరాశి లోకి ప్రవేశించినపుడు గోదావరి పుష్కరాలు ఆరంభమవుతాయి. పరమ జీవ నది గోదావరి, అందువలన ఈ నదికి చివరి 12 రోజులు అంత్య పుష్కరాలు   వుంటాయి. గురుగ్రహం నదిలోకి ప్రవేశిస్తున్నప్పుడు బ్రహ్మ దేవుడు, ఆయన కమండలం లో వున్న పుష్కరుడు, రుషి గణాలు, దేవ గణాలు కూడా నదీ ప్రవేశం చేస్తాయి. అందుచేత నది విశేషమైన, దివ్యమైన శక్తి ని పొందుతుంది. కావున పుష్కరములలో నదీ స్నానం అత్యుత్తమం.

గోమాత, గౌతమి గంగ, గోమతి నది ఈ మూడు కూడా శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబిక దేవి స్వరూపాలే. అందుచేత గోపూజ చేసినా ,  గోప్రదక్షణ చేసినా ,  గోదావరినదీమతల్లి ఎంతో ప్రీతి చెందుతుంది. గోవుకు అరటిపండు పెట్టినా , గోగ్రాసం పెట్టినా , ఆ గోదావరి తల్లికి నైవేద్యం పెట్టినట్లే.

పుష్కరము అనే పేరు ఎలా వచ్చింది?

పూర్వం తుందిలుడు అనే వ్యక్తి ధర్మబద్దమైన జీవనం సాగిస్తువుండేవారు.  ఆ పరమశివుని కోసం తపస్సు చేసి శివానుగ్రహం పొంది ఆతనిలో  స్థానం  కావాలని వరంగా కోరగా,  తన అష్ట మూర్తులలో  ఒకటైన జల మూర్తిలో స్థానం ప్రసాదిస్తాడు.  దీనితో అతను పుణ్య నదులకు అధిపతి అయ్యారు. సకల జీవులకు జీవనాధారం జలం కనుక  వాటిని పోషించే శక్తి ని పొందినవాడయ్యాడు తుందిలుడు.  ఇటువంటి శక్తిని “పుష్కరం” అంటారు. అలా తుందిలుడు పుష్కరుడు అయ్యారు. అనంతరం  సృష్టి లో భాగంగా బ్రహ్మదేవుడు, శివుడిని ప్రార్ధించి పుష్కరుడుని ఇవ్వమని కోరతాడు. పుష్కరుడు అంగీకరించడంతో బ్రహ్మ తన కమండలంలో ఉంచుకుంటాడు. ఆ తరువాత దేవగురువైన బృహస్పతి ( గురువు) జలం కోసం బ్రహ్మను ప్రార్ధిస్తాడు. కాని పుష్కరుడు ఇందుకు అంగీకరించడు. అప్పుడు ఆ ముగ్గురు ఒక ఒప్పందానికి వస్తారు. గ్రహ రూపం లో గురువు మేషాది 12 రాశులలో వున్నప్పుడు 12 రోజులు, మిగిలిన కాలమంతా మధ్యాహ్న సమయంలో  రెండు ముహూర్త కాలాల పాటు పుష్కరుడు బృహస్పతిలో వుండాలని నిర్ణయిస్తారు. ఆ సమయంలో దేవతలందరూ బృహస్పతి అధిపతిగా వున్న నదికి పుష్కరుని తో వస్తారు. కావున పుష్కర కాలంలో నదీ స్నానం చేస్తే అత్యంత పుణ్యం ప్రాప్తిస్తుంది.

Comments

comments

Article Categories:
My City · Rajahmundry

Comments

Menu Title