పౌర్ణమి గరుడ సేవ – గరుత్మంతుడు, శ్రీ మన్నారయణుడి వాహనం

Written by

ఓం నమో నారాయణాయ నమః  

పౌర్ణమి గరుడ సేవ

ఇల వైకుంఠo తిరుమల  . కలియుగ ప్రత్యక్ష దైవం   శ్రీ వేంకటేశ్వరుడు.

ఆ మలయప్ప స్వామి  ( శ్రీ   వేంకటేశ్వర  స్వామి ) పలు వాహనములలో తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు మహార్దర్శనం ప్రసాదిస్తారు . ఆ సేవల్లో గరుడ వాహన సేవ  విశిష్టమైనది .

ఆ శ్రీ మన్నారయణుడి వాహనం  గరుత్మంతుడు   . పురాణాల ప్రకారం  గరుత్మంతుడు వేదాత్మ విహగేశ్వరుడు  ( వేదాల ప్రతిరూపం ) .ఆ నారాయణుడు తనను తాను గరుత్మంతుడు  లో చూసుకుంటారని విష్ణు పురాణం లో చెప్పబడింది. గరుత్మంతుడు ని పెరియ తిరువడి అని కూడా అంటారు . అందువలనే  ఆ స్వామి గరుత్మంతుడు ని  తన వాహనంగా నియమించుకున్నారు.

గరుడ సేవ స్వామి వారి  బ్రహ్మొత్సవాల్లో  అయిదవ  రోజు  జరుపబడుతుంది . ఆ  వైభవాన్ని  తిలకించేందుకు  లక్షలాది భక్తులు తిరుమల చేరుకుంటారు. అయినపట్టికి పలు కారణాల వల్ల ఆ విశిష్ట సేవను చూసేందుకు నోచుకోని భక్తులు ఎందరో వున్నారు.   వారి   సౌకర్యా ర్ధం  తి.తి.దే వారు ప్రతి నెల పౌర్ణమి నాడు ఈ ప్రత్యెక పౌర్ణమి గరుడ వాహన సేవ జరిపేందుకు 2006 వ సంవత్సరం లో శ్రీకారం చుట్టారు.

ఆనాటి నుంచి  ప్రతి పౌర్ణమి రోజు చంద్రోదయ వేళ  వెన్నెల వెలుగుల్లో గరుడ వాహనం పై ఆ మలయప్ప స్వామి ని తిరుమాడ వీధుల్లో  ఊరేగిస్తున్నారు.  ఆ దృశ్యం చూడడానికి              కన్నుల పండుగగా  వుంటుంది . ఆ  కలియుగ ప్రత్యక్ష దైవాన్ని వీక్షించిన  భక్తులు ఎంతో తన్మయత్వం   చెందుతారు   . ఆ శ్రీనివాసుని మంగళాశాసనములతో  , తిరుమల  నిత్య కళ్యాణం పచ్చ తోరణం గా  విరాజిల్లుతోంది.

Pournami Garuda Seva Begins on July 2nd.

Comments

comments

Article Categories:
My City · Tirupati
Menu Title