పండగల నిధి – తిరుమల సన్నిధి

Written by

ఓం నమో నారాయణాయ నమః

పవిత్రమైన తిరుమల క్షేత్రం లో ఆ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర  స్వామి  కొలువై ఉన్నారు.అక్కడ ప్రతీరోజు ఓ పండుగ రోజే. శతాబ్దాలు గా, సంవత్సరములో 365రోజులకు గాను 433 పండుగలు జరుపబడుతున్నవి అంటే అతిశయోక్తి కాదు. తొలిసారి ఈ పండుగల గురించి క్రీ.శ 1380 సం.లో శ్రీవారి ఆలయము లో శాసనం  ద్వారా  తెలుపబడినది.

ఈ పండుగలు తింగళ్ మరియు విశేష దివసములుగా విభజిమ్పబడినవి. పౌర్ణమి మరియు అమావాస్య ల  నాడు కొన్ని విశిష్ట నక్షత్రముల కలయిక వలన ఏర్పడే ప్రత్యేక దినములు తింగళ్ దివసములుగ జరుపబడుతున్నవి. కాగా  ఆళ్వారులు, ఆచార్యులు మరియూ  శ్రీమన్నారాయుణిడి  అవతారముల తిరు నక్షత్రముల నాడు విశేష దివసములు  గా జరుపబడుతున్నవి.

B10-Sri-Kalyana-Venkteswara-Swamy-Temple-in-Srinivasa-Mangapuram-near-Tirupati పండగల నిధి - తిరుమల  సన్నిధి

తింగళ్ మరియు విశేష దివసముల గురించి  క్రీ.శ1488,1504,1562,1819 వసంవత్సరముల నాటి శాసనముల  లో  కూడా ప్రస్థావించ  బడినది.

క్రీ . శ 1562 నాటి శాసనం  ప్రకారం తెలుపబడిన 433 పండుగలలో బ్రహ్మోత్సవం ,పవిత్రోత్సవం మొదలగునవి కలుపుకుని 204 విశేష తిథులు మరియు నక్షత్రోత్సవం, పౌర్ణమి మొదలగునవి కలుపుకుని 217 తింగళ్ దివసములగా జరుపబడుతున్నవి.

కాగా  దీపావళి,  శ్రీరామనవమి,  శ్రీకృష్ణ జయంతి మొదలగునవి కలుపుకుని 14 పండుగలు విశేష దివసములుగా జరుపబడుతున్నవి. శతాబ్దాలుగా తిరుమలలో ఈ పండుగలు నిర్వహిమ్పబడుతున్నవి. నేటికీ ఈసాంప్రదాయాన్ని కోవెలలో కొనసాగిస్తున్నారు.

అందుకే నేటికీ తిరుమల నిత్యకళ్యాణం పచ్చతోరణముగా  భాసిల్లుతున్నది.

 

Comments

comments

Article Categories:
My City · Tirupati
Menu Title