గోదావరి మహా పుష్కరాలలో తొలి స్నానం ఆచరించేది వీరే!!

Written by

ఇంతటి ఔన్నత్యమైన వ్యక్తులు , సద్గురువులు గోదావరి మహా పుష్కరాలలో తొలి స్నానం ఆచరించనున్నారు.
పుష్కర ఘడియలు ప్రారంభం కాగానే, రాజముండ్రి కోటిలింగాల ఘాట్లో శృంగేరి పీఠాధిపతి అయిన శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ, కొవ్వూరు గోష్పాద క్షేత్రం లో కంచి పీఠాధిపతి అయిన శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి, నరసాపురం వశిష్ట ఎన్టీఆర్ ఘాట్ లో తమిళనాడు కుర్తాళం పీఠాధిపతి అయిన శ్రీ శ్రీ శ్రీ సిద్దేస్వరానంద భారతి తొలి స్నానం ఆచరిస్తారు.

శ్రింగేరి శారదా  పీఠాధిపతి  శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ

sringeri గోదావరి మహా పుష్కరాలలో తొలి స్నానం ఆచరించేది వీరే!!

వారు 1951 వ  సంవత్సరం , ఏప్రిల్ 11వ  తేదీన మచిలీపట్టణం,కృష్ణ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. 1974 వ సంవత్సరం, నవంబర్ 11 వ  తేదీన సన్యాస దీక్ష స్వీకరించి  శ్రీ  అభినవ విద్యా తీర్థ మహా స్వామిగళ్ కు ప్రధాన శిష్యులు అయ్యారు. 1981 వ సంవత్సరం , అక్టోబర్ 19 వ తేదీన  జగద్గురువు అయ్యారు. వారు దైవ జ్ఞానులు , మహా పండితులు . దేవుడి రూపముల గురించి , తన యొక్క గురువల గురించి ఎన్నో పద్యములు రచించారు. శ్రీ శంకరా చార్యులచే  ఆజ్ఞా పించబడి నట్లు గా సనాతన ధర్మాన్ని, అద్వైతాన్ని ఆచరిస్తున్నారు , ప్రచారం చేస్తున్నారు. వారి ఉపన్యాసాలు వినేందుకు రోజూ వేలాది మంది భక్తులు  వస్తారు.

కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి.

kanchi-peeta-sri-sankara గోదావరి మహా పుష్కరాలలో తొలి స్నానం ఆచరించేది వీరే!!

వీరు 1969 వ సంవత్సరం, మార్చ్ 13వ  తేదీన తాన్డలం, తిరువేల్లుర్, తమిళనాడు లో జన్మించారు. 1983 వ సంవత్సరం, మార్చ్ 29 వ తేదీన సన్యాస దీక్ష స్వీకరించి శ్రీశ్రీశ్రీ జయేంద్ర స్వరస్వతి కి ప్రధాన శిష్యులు అయ్యారు.వీరిని వారి అనుచరులు బాల  పెరియవాల్  అని  పిలుస్తారు. వీరు వేదాలని క్షుణ్ణంగా చదివి ఎంతో జ్ఞానాన్ని సముపార్జించారు.వేదాలను , వాటిలో వున్న ఆదర్శాలను ముందు తరాలవారికి తెలియపరిచేందుకు ఎంతో కృషి చేస్తున్నారు.

కుర్తాళం శ్రీమద్ సిద్దేస్వరి పీఠ వ్యవస్థాపకులు  శ్రీశ్రీశ్రీ  మౌన స్వామి, పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సిద్దేస్వరానంద భారతి.

kurtaalam గోదావరి మహా పుష్కరాలలో తొలి స్నానం ఆచరించేది వీరే!!

వారు పూర్వాశ్రమం లో  కవి,  పండితుడు. ఎన్నో సిద్ధులు పొందిన వ్యక్తి . ఎందరో భక్తులు స్వామి వారి వద్ద ధ్యానము , మంత్రం సాధన,  హోమాలను సాధన చేసి, ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి చెందారు.

Comments

comments

Article Categories:
My City · Rajahmundry

Comments

Menu Title