ఏపీకి పుష్ పుష్ పుష్కరం…

Written by

తీరంలో జనహారం వేసినట్టు వైభవంగా వెగిలిన మహాపుష్కరాలకి అద్భుత ముగింపు. పుణ్యస్నానాలతో పునీతులైన వాళ్లు ఐదు కోట్లమంది. అసౌకర్యానికి ఆస్కారం లేదు. ఆంధ్రా సంస్కారానికి ప్రపంచం నమస్కరించే స్థాయిలో జరిగాయ్ ఏర్పాట్లన్నీ. ఏదో ఓ రోజు వచ్చి పోవాలనుకున్నా ఇంతబావుంటే వెళ్లడం ఎందుకన్నాడు తనికెళ్ల భరణి. అది పుష్కర మహత్తు. రాజమండ్రి తీరంలో కనిపించిన గమ్మత్తు. మహా పుష్కరం మహోన్నతంగా జరిగింది. ఆహ్లాదం ఉంది. అందం ఉంది. ఉత్తేజం ఉంది. మనసుని తాకే చల్లని స్పర్మ కూడా ఉంది. అందుకే బంధువైంది కానీ చందమామకి మచ్చ కూడా ఉంది. పుష్కరంలోనూ అంతే. పొరపాటు కొన్నిసార్లు అనివార్యం. పునరావృతం కానీయకపోవడమే సమర్థతకి సంకేతం అంటారు చాణక్యుడు.

దుర్ఘటన. తేరుకునేందుకు తీరానికి ఎంత సమయం పడుతుందో అనుకున్నా తెల్లారే సరికి కన్నీళ్లు దిగమింగి పన్నీటి స్నానానికి భక్తగోదారి తరలిపోయింది. అదీ పుష్కర మహిమే. చలనశీలత ఉంది కాబట్టే తల్లి గోదారి బాధల గాధల్ని ఐక్యం చేసుకుంటుంది. మిట్టపల్లాలు దాటే ఒడుపువాటాలు నేర్పుతుంది. మనం తేరుకున్నాం అనడం కన్నా గోదారి లాలనలో తెప్పరిల్లాం అనడం కరెక్ట్.

ఎక్కడా ఎలాంటి అసౌకర్యం లేకపోవడం నిజంగా ఆశ్చర్యం. ఇసక రేణువులేని ఘాట్లు ఎక్కడా ఉండవ్… రాజమండ్రి కొవ్వూరుల్లో తప్ప. ఇంత మంది జనం… ఇంత ఆర్గనైజ్డ్ గా చేయడం అపూర్వమంటూ క్రౌండ్ మేనేజ్మెంట్ లో ఆరితేరిపోయిన రామ్ దేవ్ బాబానే కితాబిచ్చారంటే అంతకు మించిన మెచ్చుకోలు మరోటి లేదు. అదే మాట ఆయన పబ్లిగ్గానే ఈ మాట చెప్పారు. నేషనల్ మీడియా కంటికి కనిపించట్లేదా అన్న మాట అందుకే అన్నారు. దేవతల్ని ఆవాహన చేసేందుకా అన్నట్టు ఉర్ధ్వ ముఖంగా వెలుగులు విరజిమ్మిన సువర్ణ హారతి తరాలపాటు గుర్తుంటుంది. ఆ హారతి చూసేందుకే వచ్చాం… అహ్మదాబాద్, బెంగళూరుల నుంచి అని చెప్పిన ఆడపడుచులు టీవీల్లో కనిపించారు. ఆశ్చర్యపరిచారు. పదకొండు రోజులపాటు షావోలిన్ డిసిప్లిన్ కనిపించింది పనుల్లో … కార్యక్రమాల్లో. ఇసకేస్తే రాలనంత జనమున్నా ఎక్కడా ఇసుమంత పొరపాటు గానీ అసౌకర్యంగానీ లేదు. ఇవన్నీ ఓ ఎత్తు. తొలిరోజే అంతటి ఘోర దర్ఘటన జరిగినా ఆ ప్రభావం ఏమాత్రం పడకపోవడం పుష్కరాల్లో అన్నిటినీ మించిన హైలైట్.

పుష్కర ఘట్టం చరిత్ర సృష్టించింది. ఇంత భారీస్థాయి ఈవెంట్ అంత గొప్పగా ఎలా పూర్తయ్యిందో త్వరలో ప్రపంచం చూడబోతోంది. తెలుగు వైభవానికి ఇది నమూనా. ఆకాశం నుంచి అమృతం తొణికిన చోట పుష్కరం జరుగుతుందని పురాణం చెబుతోంది. ఆ అమృతధార అజరామరం అయ్యేలా…పుష్కరం పూర్తయ్యింది. పునీతంచేసింది.

Comments

comments

Article Categories:
My City · Rajahmundry

Comments

Menu Title