బాహుబలి థియేటర్లపై సల్మాన్ ఫ్యాన్స్ దాడి

Written by

బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్న బాహుబలికి ఇపుడు చిత్రమైన చిక్కొచ్చిపడింది. సల్మాన్ సినిమా భజరంగీ భాయ్ జాన్ బాహుబలికి సవాల్ విసురుతోంది. సల్మాన్ తిరుగులేని స్టార్ కాబట్టి డబ్బింగ్ సినిమా బాహుబలికి టెన్షనే కదా అనుకుంటున్నారా ? అది కాదు అసలు స్టోరీ. కథవేరే ఉంది. బాహుబలి రాజమౌళి బ్రెయిన్ ఛెయిల్డ్. మరి భజరంగీ భాయ్ జాన్… రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మానస పుత్రిక. అదిరిపోయే ఎమోషన్… మూఢ మత విశ్వాసాల మీద సున్నితమైన కౌంటర్లూ వేస్తూ పీకే రేంజ్ లో విజయేంద్ర ప్రసాద్ తీర్చిదిద్దిన స్టోరీ. దానికితోడు ఇండో పాక్ సెంటిమెంట్ ఉండనే ఉంది. అందుకే సల్మాన్ సినిమాకి ఇపుడు అద్భుతమైన రివ్యూలొచ్చాయ్. తొలిరోజే రికార్డుల మోతమోగిపోయింది.

కొడుకు వర్సెస్ తండ్రి :

బాహుబలికి బంపర్ టాక్ ఆల్రెడీ వచ్చేసింది. భజరంగీ షో పడీపడగానే అదుర్స్ అనిపించుకుంది. పైగా రంజాన్ అయ్యేసరికి సల్మాన్ సెంటిమెంట్ రీసౌండ్ వచ్చేస్తోంది. ఇక్కడే చిక్కొచ్చిపడింది. యూపీ, హర్యానా లాంటి చోట్ల బాహుబలి డబ్బింగ్ వెర్షన్ ఇరగదీసి ఆడేస్తోంది. దాదాపు 40శాతం
ధియేటర్లు బాహుబలి అండర్ లో ఉన్నాయ్ అక్కడ. ఆ ఎఫెక్ట్ భజరంగీ మీద పడేసరికి … ధియేటర్లు దొరక్క సల్మాన్ ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొస్తోందట. బాహుబలి ధియేటర్ల మీద దాడులు కూడా జరిగాయని నేషనల్ మీడియా చూపిస్తోంది. అది చూసి మనం సంబరపడే టైమొచ్చినట్టే అనిపిస్తోంది.

అదేంటి దాడులు జరిగితే సంబరపడడం అంటారు అనుకుంటున్నారా ? అంతే కదా మరి… మన సినిమా కలెక్షన్లు బాలీవుడ్ బ్లాక్ బ్లాస్టర్ ని టెన్షన్ పెడుతున్నాయ్. రెండోది కూడా మన రైటర్ ఇచ్చిన స్టోరీనే. ఓ రకంగా ఇది తెలుగోళ్ల టాలెంట్ బాలీవుడ్ బాక్సాఫీస్ ని కుదిపేయడం అనాలి. ఇప్పటి వరకూ సౌతిండియన్ డైరెక్టర్స్ అంటే శంకర్ ఒక్కడే తెలుసన్న హిందీ వాళ్లకి రాజమౌళి బాహుబలి బిగ్ సినిమా చూపిస్తోంది. దానికి తోడు తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా కలం విదిల్చే సరికి తెలుగోడి తడాఖా ఇండియన్ సినిమాను ఏలుతున్నట్టు కనిపిస్తోంది ఈ నిమిషం..

Comments

comments

Article Categories:
Entertainment

Comments

Menu Title