మేక్ ఇన్ ఏపీ అంటున్న మహేశ్

Written by
Make in andhra pradesh mahesh babu

నేషనల్ లెవెల్లో మేకిన్ ఇండియా..స్టేట్ లెవెల్లో మేక్ ఇన్ ఏపీ మోతమోగిపోతున్న సీజన్ ఇది. ఈ స్లోగన్ కి కొత్తఊపు రావడం ఖాయమనిపిస్తోంది ఇపుడు లేటెస్ట్ టాలీవుడ్ టాక్ చూస్తుంటే ! సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏపీ మీద కొత్తగా మనసు పారేసుకున్నాడు. నెక్ట్స్ ప్రాజెక్ట్ బ్రహ్మోత్సవంలో మెజారిటీ పార్ట్ ఏపీలో అందులోనూ విజయవాడ చుట్టుపక్కలే షూటింగ్ జరగబోతోంది. “స్టోరీ లైన్ ఏపీదైనప్పుడు ఏపీలో కాకపోతే యూపీలో తీస్తారా… మరో ఆప్షన్ లేదు మీకు అర్థమైంది నాకు ” అని దూకుడు స్టైల్లో అనుకోకండి. అసలు విషయం అంతకు మించిఉంది.

మహేశ్ బ్రహ్మోత్సవం ఫ్యామిలీ లైన్ లో… లోకేషన్ బేస్డ్ గా నడిచే స్టోరీ. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఇంతకు ముందు సీతమ్మ వాకిట్లో గోదావరి జిల్లా ల్లో… వైజాగ్ లోనే మెజారిటీ పార్ట్ షూటింగ్ జరిగింది. ఈసారి ట్రెండ్ మార్చి… రాజధాని చుట్టుపక్కల అయితే బావుంటుందని.. వీరైతే సొంతూరు బుర్రిపాలెం, గుంటూరుల్ని కూడా టచ్ చేయాలని మహేశ్ భావిస్తున్నాడని చెబుతున్నారు. ఇదో ట్రెండ్ సెట్టింగ్ మూవ్ కాబోతోందా అనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోందిప్పుడు !

టాలీవుడ్ ఏపీ వైపు వస్తే… 

మన దగ్గరా మంచి లొకేషన్స్ ఉంటాయ్. అందమైన ప్రాంతాలు కోకొల్లలుగా ఉన్నాయ్. కోస్తాలో తీస్తే చిన్న సినిమా అదే ఇతర రాష్ట్రాలకో మరో దేశానికో వెళితే పెద్ద సినిమా అనే ముద్ర ఉంది ఇన్నాళ్లూ ! కోససీమలో తీసిన ఉయ్యాల జంపాల లో బడ్జెట్ గా మిలిగింది. అదే పొల్లాచ్చిలో పల్లెటూరి సెట్ పేసి 38 రోజుల పాటు షూటింగ్ చేసుకున్న గోవిందుడు అందరివాడే సినిమాలో మాత్రం మన తెలుగు వాసనలు వెతుక్కున్నాం. మనరాత ఇంత వంకరగా ఉంది ! ఇపుడు మాత్రం అలాంటి పరిస్థితి మారుతుందని… మన లొకేషన్స్ కి మన ప్రాంతానికి అందులోనూ మన రాజధాని చుట్టుపక్కల ఊపు వస్తుందనే ఆశలు మహేశ్ ప్లాన్ తో పెరుగుతున్నాయ్. అందుకే బ్రహ్మోత్సవం ఏపీకి ఉత్సాహాన్నిచ్చే విషయమే అవుతున్నట్టు కనిపిస్తోంది.

ఎనీ సెంటర్… ఏంటి ప్రాబ్లం ? 

విడిపోయాక తీసేది అక్కడ… చూసేది ఇక్కడ అన్నట్టు మారిపోయింది పరిస్థితి. హైద్రాబాద్ చుట్టుపక్కల నానక్ రామ్ గూడాలో రామోజీ ఫిలిం సిటీలో తీస్తారు సినిమాలు. వాటికి కోట్లకి కోట్లు కలెక్షన్లు తెచ్చి పెట్టేది మాత్రం ఏపీ జనమే ! అందుకే సినిమాలు ఇక్కడే తీయొచ్చు కదా అనడం ఇపుడు ఎంత మాత్రం తప్పు కాదు. పైగా అది రాష్ట్రానికి ఇక్కడి ప్రాంతానికీ అత్యవసరం. గడ్డని గౌరవించుకోవడం అనొచ్చు…మన సినిమా పంచ్లో !అందుకే ఇలాంటి బ్యాలెన్స్ దెబ్బతింటోందనే బాహుబలి ఆడియో రిలీజ్ కేలిక్యులేటెడ్ గా తిరుపతిలో చేశాడు రాజమౌళి. ఏపీ ఇపుడు ఒకటీ అరా సక్సెస్ మీట్లకి వేదిక కావడం దగ్గర ఆగిపోవాలని కోరుకోవడం లేదు. అంతకుమించి పార్టిసిపేషన్ కోరుకుంటోంది సినిమా మేకింగ్ లో !

మహేశ్ సినిమా వచ్చిదంటే చాలా జరుగుతాయ్. అంతటి స్టార్ వస్తే మిగతా వాళ్లు కూడా రావాలన్న ఫీలింగ్ వస్తుంది. ఓ రకంగా ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇపుడు ఇదే జరగాలి కూడా ! మన దగ్గర మంచి లొకేషన్స్ ఉన్నాయ్… సినిమా కల్చర్ ఉంది. ఫెసిలిటీలు కాస్త అటూ ఇటుగా ఉన్నా సినిమాలు రావడం అంటూ మొదలైతే ఊపు ఆటోమేటిగ్గా వస్తుంది. సినిమా షూటింగ్ లు జరగాలి… రావాలి అంటే దానర్థం కేవలం సినిమా మోజు ఉందని మాత్రమే కాదు. సినిమా మేకింగ్ కోసం పెట్టే ఖర్చులో చాలా వరకూ ఏపీకి అందుతుంది. పదేళ్లు కష్టపడి నిర్మించుకునే బ్రాండ్ ఒకట్రెండు బడాసినిమాలతో వచ్చే వీలుంటుంది. లొకేషన్స్ కి క్రేజు..అక్కడ కొంత యాక్టివిటీ డెవలప్ కావడంలాంటివి ఆటోమేటిగ్గా జరుగుతాయ్.

చాలామందికి తెలీదు… దక్షిణాది సినిమా చరిత్రలో… ఫస్ట్ అవుట్ డోర్ షూటింగ్ కి లొకేషన్ అయ్యింది ఏపీనే ! బాపు రమణ డైరెక్ట్ చేసిన సాక్షి సినిమా గోదావరి దగ్గర్లో తీశారు అప్పట్లో ! క్రిష్ణ హీరో అందులో. దాదాపు యాభై ఏళ్లు అవుతోంది. మరి మొదలు పెట్టింది అక్కడే కానీ వెనకబడి పోయింది ఆ తర్వాత్తర్వాత. ముప్ఫైనలభై ఏళ్లకిందటే పక్కరాష్ట్రం నుంచి వచ్చి కోస్తాలో షూటింగ్ చేశారు బాలచందర్ లాంటి దర్శకులు. ఎన్టీఆర్ మొదలు పదిపదిహేనేళ్ల కిందట చిరంజీవి సినిమాల వరకూ మెజారిటీ పార్ట్ కోస్తాలో షూటింగ్ చేసుకునేవి. ఇపుడు మాత్రం మోజు క్రేజు మారి సీన్ రివర్స్ అయ్యింది. మరి సూపర్ స్టార్ అడుగుతో అయినా ట్రెండ్ మళ్లీ రివర్స్ అవుతుందేమో చూడాలి !
– అభి

Comments

comments

Article Categories:
Entertainment
Menu Title