బాహుబలి ఎందుకు చూడాలి ? 

Written by

ఎనిమిది అక్షౌహిణుల సైన్యం… పర్వత ప్రాంతమంతా పరుచుకుంది కాల్బలం. ఘీంకరిస్తున్న ఏనుగులు ప్రళయ భీకరంగా కనిపిస్తున్నాయి. సేనాని గంభీరంగా విగ్రహమైపోయినట్టు నిలబడ్డాడు. మౌన సముద్రంలా ఉంది ఆ ప్రాంతమంతా ! దూరం నుంచి వస్తున్న గుర్రపు డెక్కల చప్పుడు శత్రుసైన్యం రాకకి సంకేతంలా కనిపిస్తోంది. గాల్లోకి లేచిన దుమ్ము ముక్కుపుటాలకి సందేశం ఇస్తోంది. వీరత్వానికి మానవ రూపంలా ఉన్న రాకుమారుడు గుడారంలోంచి అపుడే అడుగు బైటపెట్టాడు. తుఫాన్ ముందు ప్రశాంతత అంటే ఇదే !

ఇలా మొదలవుతుంది కథ. పక్కనోళ్లు పిలిచినా… పరీక్షలు దగ్గరపడినా… పెద్దోళ్లమైపోయామని తెలిసినా వదలకుండా చదివిన చందమామ కథ ఇది. అక్షౌహిణి అంటే ఎంతో తెలీదప్పుడు మనకి. కాల్బపం పరుచుకుంది అంటే అర్థంకాదు అంత తేలిగ్గా. అయినా ఇలాంటివి ఎన్నో చదివి ఉంటాం ! ఊహించుకునేందుకు ప్రయత్నం చేశాం. కానీ విజువల్ గా చూశామా? బ్రాడ్ పిట్ నో… రస్సెల్ క్రోనో చూడ్డం వేరు. కామెరూన్ గొప్పని ఇంగ్లిష్ లో చదివి సబ్ టైటిల్స్ తో సంతోషించడం వేరు. తెలుగులో ! తెలుగులో సంగతి అడుగుతున్నా ? చూడలేదన్నదే సమాధానం కదా ! మరి హాలీవుడ్ హాలీవుడ్డే అనుకునే రోజుల్ని మార్చేందుకు ఇన్నాళ్లకి ఒక్కడొచ్చాడు. తెలగోడి దెబ్బంటే ఏంటో చూపించేందుకు… కోలీవుడ్ నో బాలీవుడ్ నో కాదు హాలీవుడ్ ని ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడు. బాహుబలితో బరిలో నిలిచాడు. ఇపుడు బాక్సాఫీసే మహీష్మతి. గెలవబోతున్నాడు బాహుబలి.

వారానికోసారి వచ్చే సినిమా కాదు బాహుబలి. పోనీ ఏడాదికోసారి రిలీజయ్యే స్టార్ హీరో మూవీ కూడా కాదు. సంవత్సరాల తరబడి ప్రాణంపెట్టి శ్రమించి చెక్కిన అద్భుత కళాఖండం బాహుబలి. ఖండాంతరాలు దాటింది క్యూరియాసిటీ ఇప్పటికే ! అపూర్వ దృశ్యాన్ని చూసేందుకు ప్రపంచం కళ్లు నులుముకొని ఎదురుచూస్తోంది. మరి మనం… ? శుక్రవారం సినిమాలా సరిపెట్టుకుంటామా ? ఇదో పండగ. ప్రపంచవ్యాప్తంగా ఎగిరే తెలుగోడి జెండా ! లైఫ్ సైజ్ కేన్వాస్ పై ఊహలకి రంగులద్ది… 24 క్రాఫ్ట్స్ కాదు పంచ ప్రాణాలు పెట్టి… సంవత్సరాల తరబడి నిద్రలేని రాత్రుల్ని దాటి తెలుగోడి టాలెంట్ ని స్పెషల్ ఎఫెక్ట్స్ గా మలిచి… హాలీవుడ్ కి అలవోకగా విసిరిన సవాల్ బాహుబలి. రాముడుఎలా ఉంటాడో తెలీదు. క్రిష్ణుడు ఎలా ఉంటాడో తెలీదు. దేవుడంటే ఇలా ఉంటాడని వెండితెరమీద చూపించింది అన్నగారు. ఆ తర్వాతే విగ్రహాలు, ఫోటోల రూపు రేఖలు మారాయ్. శ్రీరామ నవమొచ్చినా… ఏ పండగొచ్చినా ఇప్పటికీ ఎన్టీఆర్ రూపమే కనిపిస్తుంది ఆలోచిస్తే. అది మైథాలజీ. మరి మన చరిత్ర మన కోటలు… మన వైభవం… మన వీరత్వం ఇవన్నీ ఎక్కడ చూడాలి ? ఐకానిక్ అప్పీల్ ఎలా ? దానికి సమాధానం బాహుబలి. ఇది ప్యాథాలజీ. మన ఫిక్షనల్ హిస్టరీ. చెప్పుకోడానికి బాగానే ఉంటుంది. నేనెందుకు చూడాలి బాహుబలి ? అనే క్వశ్చన్ ఎవరికైనా ఉందా ? కచ్చితంగా ఉండి ఉండదు. ఆ ప్రశ్నఉన్నా లేకపోయినా దానికి మాత్రం సమాధానం ఉంది కచ్చితంగా ! ప్రతి తెలుగోడూ బాహుబలి ఎందుకు చూడాలంటే … దానికి ఒకటి కాదు ఐదు కారణాలున్నాయ్ !

1. ఇది తెలుగోడి తడాఖా…

తెలుగు సినిమా అంటే ఓ రిజినల్ ఇండస్ట్రీ. కనీసం ఇండియన్ సినిమా కూడా కాదు. అమెరికన్ బాక్సాఫీస్ లో మన దూకుడు టాప్ టెన్ లోకి వెళ్లినా… బాలీవుడ్ మన స్టోరీలు కాపీకొట్టినా… మాయాబజార్ అకీరా కురసోవా లాంటి దిగ్గజాల్ని ఆశ్చర్యపరిచినా సాయంత్రం అయ్యేసరికి మన

గొప్పంతా చీకట్లోకి జారిపోతుంది ! అలాంటిదిప్డుడు… జీవితంలోనే మొదటిసారిగా ఓ సినిమా హాలీవుడ్ ని ఆశ్చర్యంలో పడేస్తోంది. బీబీసీ దిగొచ్చి ఇంటర్వ్యూ చేసింది. ప్రపంచం ఊపిరి బిగపట్టి చూస్తోంది. హారీపొట్టరో…లార్డ్ ఆఫ్ ద రింగ్సో కాదు బ్రదర్…ఇది బాహుబలి. ఇది మన తడాఖా ! నీదీ…నాదీ…అందరిదీ !

2. ఇది మన స్టోరీ…

పర్షియన్ యుద్ధనౌకల్ని గ్రీకులు మధ్యలోంచి చీల్చి దెబ్బకొట్టారని చూశాం … అది 300. సైబీరియన్ కనుమల్లో ఓ మహా వజ్రం కోసం ఐదు సామ్రాజ్యాలు తలపడ్డాయ్. అబ్బో అదుర్స్ అన్నాం. దానిపేరు హాబిట్. చక్రవర్తి మీద బానిస యుద్ధం చేస్తే… అందులోనూ పట్టుమని రెండుమూడు వార్ సీన్లు ఓల్టేజ్ పెంచితే నెత్తిన పెట్టుకున్నాం. గ్లాడియేటర్ అంటూ గొప్పలు పోతున్నాం. వీటిలో ఎక్కడా మన స్టోరీ లేదే ? తెలుగు నేల మీదగానీ  ఇండియాలోగానీ జరిగినట్టు… నీకో చరిత్ర, వైభవం ఉన్నట్టు… నీ కల్చర్ ని ప్రపంచం గుర్తించినట్టు ఎప్పుడైనా అనిపించిందా ? లేదు. మరిప్పుడు నీదీ ఈ స్టోరీ. ఈ గొప్పందా నీది. నిన్ను నువ్ చూసుకోవా ? 70ఎంఎం అద్దంలో మనం కనిపించడం మనకి ఇష్టం లేదా ?

3. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్…

సూర్యుడు పండలా కనిపిస్తున్నాడని తినాలనిపించింది. ఎగిరితే కానీ అందుకోలేడు. ఎగిరాడు. తిన్నాడు. అప్పుడే తెలిసింది హనుమంతుడికి తన శక్తేంటో! పురాణం. మన ఓపికెంతో తెలిసే ఎఫర్ట్ టాలీవుడ్ ఏమైనా పెట్టిందంటే అది బాహుబలి. నిన్న జరగలేదు ఇలాంటి ప్రయత్నం. రేపు కూడా జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. మళ్లీమళ్లీ చేసేందుకు శక్తి సహకరించదు. అందుకే ఇది ఒక్క జీవితకాలంలో ఒక్కసారి మాత్రమేవచ్చే అవకాశం. ఐఫోన్ కోసం రెండు మూడు రోజుల ముందే దుప్పట్లు పరుచుకొని అమెరికా రోడ్డు మీద పడుకుంటుంది. ఎందుకు ? అది వాడిగొప్ప. వాడి చూడాలని. మరి మనం మన గొప్ప ఏ రేంజిదో చూడమా ? మనకేం తక్కువ ? జిల్ … జీల్ అన్నీ ఉన్నాయ్.
4. బాహుబలి రిలీజ్ కి ముందు… తర్వాత…

అవతార్ సినిమా చూశాక… ఎనిమిది బిగ్ బడ్జెట్ సినిమాలు ఆగిపోయాయ్. అప్పటికే 20-30% షూటింగ్ అయినవే అన్నీ. ఆ రేంజ్ లో తీస్తే తీయాలి… లేదంటే అరకొర ప్రయత్నాలు ఎందుకు ? ఇప్పుడు మనం అంత హై స్టాండర్డ్స్ అందుకోలేం. లెటజ్ పోస్ట్ పోన్ ఇట్ అని. ఇది ఫాక్స్ న్యూస్ ఇన్ఫో. ఒక గీత గీసి… దీనికి ముందు దీని తర్వాత అంటే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. బాహుబలి అలాంటి గీతే ! ఇది టాలీవుడ్ రాత మార్చే గీత. అందుకే కరణ్ జోహర్ వచ్చి కలుస్తాడు. తమిళ్ ఇండస్ట్రీ సినిమాలు వాయిదా వేస్తుంది. శ్రీమంతుడు దారిస్తాడు. హాలీవుడ్… వావ్ ఎ మిరాకిల్ ఫ్రమ్ ఇండియా అంటుంది. ఇది పీకే కాదు స్టోరీతో పడగొట్టడానికి. ఇది బాహుబలి…విజువల్ ఎఫెక్ట్స్, భారీతనంతో తొడగొడుతుంది.

5. హాలీవుడ్ వయా తెలుగు నేల

హాలీవుడ్ మన దగ్గరకొస్తుందా ? ఖర్చుతగ్గుతుందంటే మన దగ్గరకేంటి..లక్కవరం లాంటి ఊళ్లకి కూడా వచ్చేస్తుంది. ఖర్చు తగ్గించుకోవాలని  హాలీవుడ్ ఇప్పిటికే… న్యూజీలాండ్ లాంటి దేశాలకి వెళుతోంది స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం. సగం సినిమాలకి ఎగ్జిక్యూషన్ అండ్ ఫినిషింగ్ వర్క్ అంతా జరుగుతున్నది న్యూజీలాండ్, ఆస్ట్రేలియాల్లోనే ! హాంకాంగ్ లో కూడా కాస్ట్ తక్కువే హాలీపుడ్ తో పోలిస్తే. అందుకే పెద్ద సినిమాలకి ఆ రెండే డెస్టినేషన్స్ ఇప్పటికీ ! బాహుబలి రిలీజ్ అయ్యాక మనవైపు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇందులో పనిచేసిన వాళ్లు మూడొంతుల మంది మన టెక్నీషియన్లే !

 

వీలైతే… మళ్లీ మళ్లీ చూద్దాం డ్యూడ్. పోయేదేం లేదు. మహా అయితే సీక్వెల్ తీస్తారు !

– అభి

Comments

comments

Article Categories:
Entertainment

Comments

Menu Title