సైజు జీరో కాదు.. వెయిట్ 100

Written by

చ‌క్క‌న‌మ్మా చిక్కిన అంద‌మేనన్నారు వెన‌క‌టికొక‌రు.. కానీ అందాల బొమ్మ బొద్దుగా ఉన్న అంద‌మేనంటున్నారు ఇపుడు. సైజ్ జీరో ఫ‌స్ట్ లుక్ లో అనుష్క‌ను చూస్తే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఫ‌స్ట్ లుక్ లో అనుష్క గుర్తు ప‌ట్టేందుకు కాస్త టైమ్ తీసుకుంటుంది. ఈ బ్యూటీ మ‌న బొమ్మ‌ళీయా. లేక గీత సింగా అన్న డౌట్ వ‌స్తోంది. ఎపుడు జీరో సైజులో కాకున్నా.. కాస్తా అటు ఇటుగా ఉండే స్వీటీ ఇపుడు ఏకంగా డ్ర‌మ్ములా త‌యారైపోయందేంటి అని షాకైపోతున్నారు అభిమానులు.

రాఘ‌వేంద్ర రావు త‌న‌యుడు ప్ర‌కాశ్ డైరెక్షన్లో వ‌స్తోంది సైజ్ జీరో. సినిమా పేరే కాదు.. కింద ట్యాగ్ లైన్ కూడా డిఫ్రెంట్ గా ఉంది. స‌న్న‌జాజి నడుము అంటూ అనుష్క‌ను డ్ర‌మ్ములా చూపించ‌డంతో.. అస‌లు స్టోరీ ఎంటో క్యూరియాసిటీని ఫ‌స్ట్ లుక్ తోనే పెంచేశాడు డైరెక్ట‌ర్.
ఈ సినిమా కోసం ఏకంగా వంద కేజీలు పెరిగిన బొమ్మాలి.. వెంట‌నే మ‌ళ్లీ నార్మ‌ల్ సైజుకు వ‌చ్చేసింది. ఇటీవ‌ల రుద్ర‌మాదేవి ప్ర‌మోష‌న్ లోనూ స్లిమ్ గా క‌నిపించి అంద‌రిని అవాక్క‌య్యేలా చేసింది. ఇంత‌లో ఎపుడు బ‌రువు పెరిగింది.. ఎపుడు త‌గ్గించేసింది అన్న డౌట్ వ‌స్తోంది అంద‌రికి.. ఎంతైన యోగా బ్యూటీ క‌దా.. అందుకే అలా వెయిట్ పెంచేసి.. ఇలా త‌గ్గంచేసింది. అయితే ఆ ట్రిక్కేదో అంద‌రికి చెబితే బావుంటుందేమో.. పొద్దున్నే లేచి కొవ్వు క‌రిగించుకునే వాళ్ల‌ తిప్ప‌లన్నా త‌ప్పుతాయి.

-ప‌వ‌న్

Comments

comments

Article Categories:
Entertainment
Menu Title