శిఖరం చేరిన బాహుబలి

Written by

రికార్డులు బద్దలు కొడుతున్న బాహుబలి ఏవన్నా పోటుగాడు అనుకుంటున్నారా ? కాదు. పోటుగాళ్లకి పోటుగాడు. సాటివాళ్లలో మేటిగాడు. ఈ మాట అంటున్నది బాలీవుడ్డో టాలీవుడ్డో కాదు. ఎవరి సత్తా ఏంటో లెక్కలతో సహా చెప్పే ఫోర్బ్స్ మేగజైన్. అవును. ఇప్పటి వరకూ ఇండియాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ పీకే పేరుతో ఉంది. ఓవర్సీస్ తోపాటు ఇండియాలోనూ అమీర్ సినిమాదే రికార్డ్. కానీ ఇండియాలో ఆ రికార్డ్ ని సల్మాన్ భజరంగీ భాయ్ జాన్ క్రాస్ చేసేసింది. బాహుబలి నంబర్ త్రీ పొజిషన్ లో ఉందనేది లేటెస్ట్ లెక్క. కానీ ఇందులో కూడా ఛేంజ్ ఉందంటోంది ఫోర్బ్స్. తాజా అంచనాల ప్రకారం బాహుబలి ఇండియాస్ హయ్యెస్ట్ గ్రాసర్ కాబోతోందని లెక్క తేల్చింది. బాలీవుడ్ కి మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇస్తోంది.

బాహుబలి… ది బెస్ట్… ?

ఇప్పటి వరకూ భాయ్ జాన్ 594 కోట్లు కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో అయితే 340 కోట్లు దాటేసి పీకే రికార్డుని ఏకేసింది.
సరే. బాహుబలి భజరంగీ కాన్నా కాస్త వెనకుంది. 566 కోట్లు. ఇప్పటికే రిలీజ్ అయ్యి ఆరువారాలు దాటింది కాబట్టి… ఒక్క తెలుగులో తెప్ప మిగతా భాషల్లో కలెక్షన్స్ డల్ అయిపోయాయ్. ఇండియాలో ఇదీ సీన్. కానీ ప్రపంచవ్యాప్తంగా మాత్రం బాహుబలి బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గానే ఉందంటోంది ఫోర్బ్స్. బాహుబలికి పోటీ ఇచ్చే ఎపిక్ జోనర్ ఏసినిమా రాకపోవడమే దానికి కారణం అంటున్నారు. ఇదే రన్ ఇంకొన్నాళ్లుంటుంది. దీనికితోడు బాహుబలి ట్రిమ్డ్ వెర్షన్ కూడా ఇంటర్నేషనల్ ఆడియెన్స్ కోసం రెడీ అవుతోంది. అంటే ఇందులో పచ్చబొట్టేసినా… లాంటి పాటలు ఉండవ్. అలాగే మన నేటివిటీ కోసం పెట్టిన కొన్ని సీన్స్ కూడా ఎడిట్ అయిపోయాత్. పక్కా హాలీవుడ్ మూవీలా ఏ 110 నిమిషాలతోనే రిలీజ్ అవుతుంది. సినిమా. అప్పుడు షార్ప్ గా రేసీగా ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుందనే అంచనాలున్నాయ్. అప్పీల్ ఎలాగూ హాలీవుడ్ రేంజే కాబట్టి… లెంగ్త్ కూడా అలాగే ఉంటే ఇంకా లాంగ్విటీ పెరుగుతుందని ఫోర్బ్స్ లెక్క కడుతోంది.

అదే జరిగితే బాహుబలి మరో 150 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద లెక్కేం కాదు. నిజమే. ఇప్పటికీ ఆల్ టైమ్ హయ్యెస్ట్ కి మధ్య గ్యాప్ పెద్ద ఎక్కువేం లేదు. బాహుబలి పొటెన్షియల్ ని బట్టీ ఆ సంగతి చెప్పేయొచ్చు. ఇక కొత్త వర్షన్ కూడా రిలీజ్ అయితే ఈ రేంజ్ మరింత మించిపోవడం ఖాయం. అదేంటి రెండు వర్షన్స్ గా రెండు సార్లు రిలీజ్ అయితే ఎలా పీకేతో పోలుస్తారు అని డౌటొస్తోందా ? పీకే కూడా రెండుసార్లు రిలీజ్ అయ్యాకే అంత కలెక్ట్ చేసింది మరి. ఓసారి… ఇండియా అండ్ వరల్డ్ వైడ్ గా. రెండోసారి చైనాలో. అక్కడ కూడా 120 కోట్లుకి పైగా కొల్లగొట్టి పీకే ఈ రేంజ్ కొచ్చింది. మరి బాహుబలి కూడా రెండో విడతలో ఇలాగే ఓ పట్టుపట్టబోతున్నాడు. కొట్టండి… జై మహిష్మతీ… !

11721945_982943985060125_2010431720_n-1 శిఖరం చేరిన బాహుబలి

Comments

comments

Article Categories:
Entertainment
Menu Title