లుంగీ లగేరహో… సీన్ అదిరిందహో…

Written by

ఇండియాలో ఇపుడు రెండే పాపులర్. నార్త్ లో సల్మాన్ బజరంగీ. సౌత్ లో మహేశ్ లుంగీ. హార్డ్ కోర్ మాస్ హీరో పాస్సివ్ రోల్ చేసేసరికి భాయ్ ఇపుడు బంపర్ హిట్ అయిపోయాడు. ఇక్కడా అంతే. అయితే చాక్లెట్ బాయ్ లా… లేదంటే సింపుల్ పంచ్ లతో మాస్ గా కనిపించే మహేశ్ మొదటిసారి లుంగీ ఎగ్గట్టాడు. అదేంటి… చూడొద్దంటున్నా అంటూ పోకిరీలో వేశాడు కదా లుంగీ అనకండి. సీన్ గురించి చెప్తున్నాం ఇక్కడ ! విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే పోర్షన్ అంతా శ్రీమంతుడికి హైలైట్ అంటున్నారు. అందుకే పోష్ లుక్ తో సైకిల్ తొక్కిన సీన్ కి పోటీగా ఇపుడు లుంగీ లుక్ అదరగొడుతోంది. ఎప్పుడూ కాళ్లు ఒళ్లూ కనిపించనివ్వమని మహేశ్ (వన్ లో షవర్ బేర్ బ్యాక్ సీన్ మినహాయింపు ) ఇపుడు లుక్ కోసం కండీషన్స్ కాస్త సడలించినట్టు కనిపిస్తున్నాడు.

లుంగీ డాన్స్… లుంగీ ఫ్యాన్స్…

ముందు నుంచి ఆంధ్రా ప్రాంతంలో లుంగీ యమపాపులర్. కట్టులో కాస్త తేడా ఉన్నా సీమలోనూ అడ్డ పంచె అంతే ఫేమస్. ఈ మధ్య అలవాటు తప్పుతోంది. షార్ట్స్, నైట్ ప్యాంట్స్ వచ్చేశాయ్ పల్లెటూళ్లకి కూడా ! పాతికేళ్లొచ్చినా లుంగీకట్టుకోవడం రాని కుర్రోళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఇది వరకంటే లుంగీ కచ్చితంగా కట్టుకోవాలన్న ఫీలింగ్ ఉండేది ఊళ్లలో. ఇంట్లో నాన్ననో… అన్నలతో చూసి లుంగీ కడితేనే పెద్దోడు అయినట్టు అనే ఇంప్రెషన్ కూడా దీనికి కారణమే. మేనల్లుడుకి బట్టలు పెట్టే పండగ ఇప్పటికీ కొందరు ఠంచనుగా చేస్తున్నారు. కానీ..ఆ ఫంక్షన్ లోనూ మా
మేనల్లుడు జీన్స్ తోనే కూర్చున్నాడని జోకులేస్తున్నారు మేనమామలు. హహ్హహ్ఙహ…

సినిమాల పుణ్యమో రజనీకాంత్ ఎఫెక్టో కానీ లుంగీ రివైవల్ అవుతోంది రెండు మూడేళ్ల నుంచి. సదరన్ మార్కెట్ కోసం లుంగీ మీద షారుఖ్
పాట చేసే సరికి తెలిసొచ్చింది లుంగీ తడాఖా ఏంటో. ఆ పాట పుణ్యమాని… తమిళనాడు ఏపీల్లో చెన్నై ఎక్స్ ప్రెస్ ఏకంగా 45 కోట్లు వసూలు చేసిందని కూడా చెప్పాడు డైరెక్టర్ రోహిత్ శెట్టి. అదీ మన లుంగీ ఎఫెక్ట్. ఆ తర్వాత సదరన్ హీరోలు మరీ ముఖ్యంగా తెలుగు హీరోలు, హీరో యిన్లు కూడా లుంగీలు ఎగ్గట్టారు. స్టెప్పులేసి అదరగొట్టారు. ఇప్పుడు లీడింగ్ లో ఉన్న హీరోయిన్లంతా ఏదో సినిమాలో కచ్చితంగా లుంగీ కట్టినోళ్లే. బన్నీ, చెర్రి, ఎన్టీఆర్ పవన్ దగ్గర నుంచి మిగతా కుర్ర హీరోలంతా లగేహరో లుంగీ అన్నారు ఏదో ఓ సీన్ లో అయినా !

లుంగీ రివైవల్…

కట్టుకోడానికి కంఫర్ట్ ఉండి… కేరీ చేయడానికి ఈజీ అనిపించే లుంగీ మన సౌత్ లోనే మొదలై మిగతా ప్రాంతాలకి పాకింది. కేరళలో అయితే ఆడవాళ్లు కూడా కడతారు లుంగీ. కర్ణాటక, తమిళనాడు అయితే సరేసరి. మన రాష్ట్రాల్లోనే కాదు… దాదాపు 25 దేశాల్లో లుంగీ కల్చరుంది. బొందు లుంగీలు, జిప్ లుంగీలు, అతికించుకో కట్టుకో టైపు లుంగీలు ఇలా రకరకాలున్నాయ్ ఇందులో కూడా ! మొత్తానికి మళ్లీ మహేశ్ లుక్ ఇచ్చేసరికి లుంగీ క్లాస్ లోనూ పాపులర్ అవుతోంది మళ్లీ. ఆ లుక్ వస్తున్న హిట్స్, టాక్ చూడండి మోత ఏ రేంజ్ లో మోగుతోందో !

Comments

comments

Article Categories:
Entertainment
Menu Title