రొమాన్స్ కి కూడా అర్ధం వెతికే పరిస్థితి వచ్చిందా..

Written by

బాహుబలి సినిమాలో అవంతిక పాత్రలో ఉన్న తమన్నాకి ప్రభాస్ కి మధ్య జరిగే రొమాంటిక్ సీన్ ని కూడా తప్పు పట్టే పరిస్థితిలో ఒక మీడియా రాసిన కధనం..ప్రేక్షకులకి ఏది కనెక్టవుతుందో అదే తీస్తానని ..సమాధానం చెప్పిన రాజమౌళి..రాజమౌళి కాబట్టి చిన్న సమాధానం తో సరిపుచ్చాడు..అదే కొంచెం పైత్యం ఉన్నవాళ్లయితే ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో ఉన్న చాలా సీన్స్ ని చూపించి మరీ నోరు మూయించేవారు.

యుద్ధవిద్యలో ఆరితేరిన అమ్మాయికి ,బలవంతుడయిన అబ్బాయికి మధ్య జరిగే చిన్న ప్రణయ యుద్ధాన్ని కూడా రంధ్రాన్వేషణ చెయ్యడం మీడియాకి మాత్రమే చెల్లింది. గులాబిరంగులో ఉన్న తనపెదవులకి మరింత రంగులద్దడం,చటుక్కున ఆకర్షించే కళ్ళకి కాటుక దిద్దడం,బోసిగా ఉన్న తెల్లని నుదుట చిన్న బొట్టు దిద్దటం చాలా అందంగా ఉన్న అమ్మాయికి మరింత అందాన్ని ఇవ్వవా….ఇవన్నీ కూడా అవంతికని కూర్చోబెట్టి చేస్తే చక్కగా చేయించుకోవడానికి అవంతిక పెళ్ళికూతురుకాదు..సినిమా ప్రకారం ప్రతీకారం కోసం వేచిచూస్తున్న అమ్మాయి అందుకే అవంతికకి ,తనొక అమ్మాయి అని గుర్తుచెయ్యాలికాబట్టి ఆ సీన్ అవసరం పడింది. ప్రభాస్ నువ్వు అమ్మాయి,నేను అబ్బాయి అనిచెప్పడం సమంజసమే ..

ఒక సినిమాలో లోటుపాట్లు వెతికి రాసేముందు కొద్దిగా ఆలొచిస్తే సరిపోయేదానికీ.. పూర్తిగా అర్ధంలేని వ్యాఖ్యలని రాయడం మాత్రం కరెక్ట్ కాదు సినిమాని సినిమాలా చూసివచ్చేవాళ్ళకు ఇది వర్తించదు..అభిప్రాయాలకు వేదికగా ప్రసార మాధ్యమాలని,Social networking sites లో బల్లగుద్ది మరీ వాదించేవాళ్ళకు అవసరమే. మరి ఒకప్పుడు “పరమానందయ్య శిష్యులకధ “సినిమాలో NTR ఒక సాత్యంత్రం తనప్రేయసితో గడిపాకా తెల్లవారి లేచి అయ్యో కార్తీకమాసం అని ,శివపూజకి వేళయ్యిందని గుర్తించి శివలింగాన్ని ఎక్కడ చూసి పూజచేస్తాడో ఎంతమందికి గుర్తుంది??.. “అక్కట కన్ను గానక మదాంధుడనయి ప్రియురాలి ఇంటిలోచిక్కితి సేవపూజ ఎటు చేయుదు,వేళ అతిక్రమించే లిగమెక్కడా కానరాదు..పరమశ్వరలింగముబోలు రాయో,వేరొక్క స్వరూపమో” అంటూ కీర్తిస్తూ పాడే NTR లో భక్తిని మాత్రమే కదా చూడాలి.. అసలు శివలింగమేంటీ పూజలేంటీ అనేవాళ్ళు ఉన్నరోజుల్లో సమాధానం చెప్పడం కూడా కష్టమే

Comments

comments

Article Categories:
Entertainment
Menu Title