రిలీజ్‌లంటే పండగలేనా..?

Written by

ఏడాదికి ఎన్ని సినిమాలు చేసినా.. రిలీజయ్యేది మాత్రం పండగలకే అన్నట్లుంది ఇపుడు టాలీవుడ్్లో పొజిషన్‌. రెండు మూడేళ్ల కష్టపడి తీసిన సినిమాను కూడా కలిసొచ్చే పండగ టైమ్‌లోనే రిలీజ్‌ చేస్తున్నారు. ఎపుడో ఒకటి రెండు సినిమాలు తప్ప.. మిగతా సినిమాలన్నీ.. పండగలే రిలీజ్‌ డేట్‌గా ఫిక్స్‌ చేసుకొని రంగంలోకి దిగుతున్నాయి. టాలీవుడ్‌లో రిలీజ్‌ డేలన్నీ దసరా, సంక్రాంతి సీజన్‌లోనే ఉంటున్నాయి. సూపర్‌ స్టార్లైతే సంక్రాంతి, దసరాలకు సినిమాలు చేస్తానంటూ ఫ్యాన్స్‌కు ఓ డేట్‌ ఫిక్స్‌ చేస్తున్నారు. మొన్నటి వరకు మాములుగా ఉన్న ఈ వ్యవహారం ఇపుడు పీక్స్‌ కు వెళ్లింది.

2015లో ఫస్టాఫ్‌లో స్టార్ల సినిమాలు లేవు. ఈ రెండు నెలలు బాహుబలి, శ్రీమంతుడు సందడి చేసినా… మిగతా స్టార్ల ఫస్ట్‌ లుక్‌లు కనిపించలేదు. ఫస్టాఫ్‌ను మొత్తం ఖాళీగా వదిలేసి.. ఇఫుడు హడావుడిగా వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దసరాకు వస్తోన్న సినిమాల లిస్ట్‌ భారీగానే ఉంది. వరుణ్ తేజ కంచె, రామ్ శివం, రామ్ చరణ్ శ్రీనువైట్ల సినిమా, రవితేజ బెంగాల్ టైగర్‌ ఇలా సినిమాలన్నీ గేట్లేత్తిసిన ఫ్లడ్‌లా దూసుకొస్తున్నాయ్‌. సినిమా మొదలు పెట్టగానే దసర రిలీజ్‌ అని డేట్‌ ఖరారు చేయడం.. కలెక్షన్ల అంత మూకుమ్మడిగా రావడం ఇపుడు రోటిన్‌ అయిపోయింది. రామ్‌ చరణ్‌ గత సినిమాలన్నీ పండుల సీజన్‌లో రిలీజైనవే. పండగల టైమ్‌లో టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తుండడంతో హీరలు, నిర్మాతల మనస్సు.. దసర, సంక్రాంతిల మీదికి మళ్లుతుంది.

దసరానే కాదు… ఆర్నేళ్ల తర్వాత వచ్చే సంక్రాంతికి ఇపుడే ఖర్ఛీఫ్‌ వేసేశారు మన స్టార్‌ హీరోలు. రెండు సినిమాలు ఒకే టైమ్‌లో కలెక్షన్లకు ఇబ్బంది తప్పదని తెలిసినా.. క్లాష్‌ అయ్యేందుకు రెఢీ అయిపోతున్నారు. పవన్‌ సర్థార్‌, ఎన్టీఆర్‌ నాన్నకు ప్రేమతో రెండు సినిమాలు పొంగల్‌కే వస్తున్నాయ్‌. మహేశ్‌ తన బ్రహ్మోత్సవాన్ని కూడా సంక్రాంతికే విడుదల చేస్తానన్నాడు. ఏడాదిలో 365 రోజుల్లో రిలీజ్‌ డేట్‌లే దొరకరన్నట్లు… పండుగలకొచ్చి కొట్టుకోవడం కామనైపోయింది. సినిమాలో సత్తా ఉండాలే కానీ.. ఏ టైమ్‌లోనైనా దుమ్ముదులుపుతాయ్‌. ఈ విషయాన్ని బాహుబలి, శ్రీమంతుడు ప్రూవ్‌ చేశాయి. మరి మన నిర్మాతలు, హీరోల మైండ్‌సెట్‌ మారుతుందో లేదో..

Comments

comments

Article Categories:
Entertainment
Menu Title