మోడ్రన్ కామ్రేడ్ కొరటాల శివ

Written by

శ్రీ ఓ గౌర‌వ పూర్వ‌క సంబోధ‌న‌కు ప్రారంభ సూచన‌. శ్రీ‌శ్రీ ఉత్త‌మోత్త‌మ ఆలోచ‌కు.. ఉద్య‌మానికి ఆలంబ‌న‌. శ్రీ‌శ్రీ శ్రీ‌మంతుడు ఊరి కోసం ఇవ్వ‌డం నేర్పిన వాడు. నీతి చెబితేనే గ‌మ‌న రీతి మారిపోదు అని న‌మ్మిన‌వాడు. మ‌హాక‌వి శ్రీ‌శ్రీ ఆరాధ‌కుడు. ఆలోచ‌న‌ల్లో శ్రీ‌మంతుడు. మ‌నంద‌రి ఆరాధ‌కుడు. ఈ కొర‌టాల శివుడు. ఇంకెన్నో డు..డు.. డు..ల‌తో డోలు బాజా మోగించేద్దాం ఇవాళ‌. ఊరి నుంచి చాలా తీసుకున్నారు.. తిరిగిచ్చేయాలి. ఇక్క‌డి వ‌ర‌కూ చెబితే.. అది నీతి వాక్యం. బాగోదు.. నీతులు చెప్ప‌డం త‌న ధ‌ర్మం కాదు అని అనుకున్నాడు కొర‌టాల శివ‌.

సందేశాల పేరిట సినిమానా?

సినిమా స‌మాజాన్ని మారుస్తుందా? అదే జ‌రిగితే శంక‌రాభ‌ర‌ణం, సాగ‌ర సంగ‌మం, సీతారామ‌య్య గారి మ‌న‌వ‌రాలు వీటిని చూసి జ‌నం మారిపోవాలే.. ఏమో.. అనుకున్నాడు శివ‌. మ‌ళ్లీ .. ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. ఎస్‌.. ఈ సారి డైలాగ్ రూపే మార్చేశాడు. త‌న ఆలోచ‌న‌ల రూటే మార్చేశాడు. ఊరి నుంచి చాలా తీసుకున్నారు.. తిరిగి ఇచ్చేయాలి.. లేక‌పోతే లావైపోతారు. యా.. ఇలా డైలాగ్ చెప్పిస్తే వెరీ క్యాచీ అండ్ ఆల్సో వెరీ ఫ‌న్నీ.ఆ.. త‌రువాతే సందేశ‌మైనా.. ఏమైనా.. యా..నేర్చుకున్నోడికి నేర్చుకున్నంత‌. ఔను! ఈ పెద‌కాకాని కుర్రాడు క‌మ్యూనిస్టు కుటుంబంలో పుట్టి పెరిగాడు. శ్రీ‌శ్రీ సాహిత్యం చ‌దివాడు. ఇవాళ శ్రీ‌మంతుడు తీశాడు ఈ బీటెక్ కుర్రాడు. శ్రీ‌మంతుడు ముందు కూడా ఇత‌డికో జీవితం ఉంది. నా.. అని చెప్పుకునే క్ర‌మంలో.. ఆ.. త‌ర‌హా పేజీల‌లో ఉత్త‌మోత్త‌మ సంభాష‌ణ‌లు ఉన్నాయ్‌. క‌ట్ చేద్దాం.. ఈ సీన్‌ను ఇక్క‌డితో క‌ట్ చేద్దాం..

యా..మున్నా.. ముహూర్తం షాట్‌కు వెళ్లొద్దాం..

గెల‌వాలనుకోవ‌డం ఆరాటం.. గెలిచి తీరాల‌నుకోవ‌డం పోరాటం.. ఇదీ ప్ర‌భాస్ చెప్పిన డైలాగ్‌. సెబ్బాస్‌రా.. శివ ..ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌రనో / మ‌రెక్క‌డో ఈ డైలాగ్ ఎగిరిపోయింది. కానీ.. ఎందుక‌నో నోవ‌ల్టీ నిండిన నాటి మాట‌లు నాటుకుపోయాయ్‌. బృందావనంలో సిటీ నుంచి వ‌చ్చాడు సాఫ్ట్‌గా ల‌వ‌ర్ బోయ్‌లా క‌నిపిస్తున్నాడ‌నుకుంటున్నావేమో… క్యారెక్ట‌ర్ కొత్త‌గా ఉంద‌ని ట్రై చేశా. లోప‌ల ఒరిజిన‌ల్ అలాగే ఉంది.. దానిని బ‌య‌ట‌కు తెచ్చావ‌నుకో ర‌చ్చ‌.. ర‌చ్చే..! గుర్తుందిగా.. బుడ్డోడు ఈ డైలాగ్‌ను ఏ రేంజ్‌లో చెప్పి త‌రువాత విల‌న్లు ఇర‌గ‌దీశాడో..

భ‌లే చెప్పావ్ డ్యూడ్‌..!

వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్.. పోయేదేముంది.. మ‌హా అయితే తిరిగి ప్రేమిస్తారు మిర్చిలాంటి కుర్రాడు ప‌లికిన సంభాష‌ణ ఇది. ఔను! మాట రూపు మారింది. తీరూ..తెన్నూ అన్నీ.. అన్నీ.. మారిపోయాయ్‌. కానీ కొర‌టాల మాట అంద‌రూ వింటున్నారు. ఊ .కొడుతున్నారు. ఆహా అంటున్నారు. కొన్ని చోట్ల మాట‌కు ప‌ట్టం క‌డుతున్నారు. కానీ.. ఆయ‌న మాట విని ఊరిని ద‌త్త‌త తీసుకుంటున్న‌వారెంద‌రు? నా సినిమా చూసి కొంద‌రైన మారితే ఆనంద‌మే.. అని చెబుతారాయ‌న‌.

మా.. తుఝే స‌లాం

అమ్మే నా జీవితంలో హీరో. అలాంటి రియ‌ల్ హీరోల‌ను చాలా మందిని చూశా.. వాళ్లే నా క‌థ‌ల‌కు స్ఫూర్తి.. అని వివ‌రించారు ఓ ప్రముఖ మీడియాతో.. ఔను! అమ్మను మించిన హీరో.. శ్రీ‌శ్రీని మించిన క‌వి.. ఎక్క‌డా ఉండ‌రు. బ‌తుకు నేర్పిన ప‌ల్లె.. బ‌తుకును దిద్దిన క‌మ్యూనిజం శివ‌ను వీడి ఉండ‌వు. ఏమంటావు డ్యూడ్‌. మ‌హాప్ర‌స్థానంలో చెప్పిన‌ట్లు.. నిన్న వ‌దిలిన పోరాటం నేడు అందుకొన‌క త‌ప్ప‌దు. శ్రీ‌మంతుడు సినిమా స్ఫూర్తితో.. మ‌న గ్రామీణ భార‌తావ‌ని గ‌తి మారితే.. ప్ర‌గ‌తి దారుల ప‌య‌నిస్తే.. అంత‌కుమించి ఆనందం ఏముంటుంది. ఎక్క‌డో ఉన్న అమ్మకు ఇంత‌కు మించిన గౌర‌వాన్ని..ఏ పుర‌స్కారాలు అందిస్తాయ్‌! మ‌నో వాంఛ ఫ‌ల సిద్ధిర‌స్తు.. భూయాత్ కాంక్షిత సిద్ధిర‌స్తు.. అన్నారెవ‌రో…! వ‌ర్థిలు శ్రీ‌మంతా.. వ‌ర్థిల్లు. మా ఆలోచ‌న‌లో.. మా ఆచ‌ర‌ణ‌లో.. ఇప్ప‌టికింతే.

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

Comments

comments

Article Categories:
Entertainment
Menu Title