మోడీ మెచ్చిన రెండు తెలుగు సినిమాలు

Written by

హైప్ పెరిగింది. ప్రపంచమంతా మన సినిమాల గురించే మాట్లాడుకుంటోందిప్పుడు. అనుకోకుండా ఢిల్లీలోనూ ఇలాగే అలా కలిసొచ్చింది. మోడీకి రెండు సినిమాలు నచ్చేశాయ్. ముందస్తుగా మెచ్చుకున్నారు. వీలు చూసుకొని రెండూ చూసి తీరుతానన్నారు. అందులో మొదటిది బాహుబలి. ప్రపంచమంతా మోతమోగిస్తున్న ఈ సినిమా తెలుగు సినిమా స్థాయినే కాదు ఇండియన్ సినిమా రేంజ్ నే పెంచిందంటూ ప్రభాస్ అండ్ కో ని ప్రశంసలతో ముంచెత్తారు మోడీ. ప్రభాస్ బాబాయ్ క్రిష్ణంరాజు బీజేపీ నాయకుడు కాబట్టి… ఆ మాత్రం ప్రశంస కామన్ అని సరిపెట్టుకోకండి. అది కచ్చితంగా తెలుగు సినిమా గొప్పే. అందుకే మోడీ వరకూ తీసుకెళ్లాలన్న ఆలోచన చేయగలిగారు బాహుబలి మేకర్స్. ఇపుడు మళ్లీ ఆలాంటి సీనే రిపీట్ అవుతోంది. శ్రీమంతుడు కూడా మోడీ మనసుకి దగ్గరగా ఉందంటున్నారు.

దత్తత కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా శ్రీమంతుడు. బంపర్ టాక్ తెచ్చుకుంది ప్రివ్యూతోనే. ఫస్ట్ షో పడకముందే ఈ సినిమా ప్రివ్యూ మోడీ కోసం సిద్ధం చేశారట. అయితే ఖాళీ చిక్కకపోవడంతో అది కాస్తా వాయిదా పడింది. అయితే కథ క్లుప్తంగా చెప్పగానే… అవునా ! వండ్రఫుల్ నేను తప్పక చూస్తా… ఇలాంటి సినిమాలు రావాలంటూ ఆయన అభినందించారట. శ్రీమంతుడు స్టోరీ అంతా… మోడీ కాన్సెప్ట్ చుట్టూనే తిరగడం దానికి కారణం. ఊరు దత్తత… ఊరి కోసం మనం ఏం చేయొచ్చు అనే విషయాన్ని కమర్షియల్ ఫార్ములాతో చెప్పిన సినిమా ఇది. మోడీకి కూడా ఇదే పద్ధతి నచ్చుతుంది కదా. ఆయన పాలసీలు కూడా ఇంతేగా… ప్రజాప్రయోజనం ఉన్నా వాటికి కమర్షియల్ కలర్ ఇచ్చి భారీ రేంజ్ లో సక్సెస్ చేస్తారు కదా… అది సబ్సిడీ అయినా… మేక్ ఇన్ ఇండియా అయినా !

మొత్తానికి ఇది తెలుగు సినిమా పండగ చేసుకోవాల్సిన సమయం. నెల రోజుల టైమ్ లోనే రెండు సినిమాలకి దేశస్థాయి గుర్తింపు, పైగా ప్రధాని నుంచే ప్రత్యేకంగా ప్రశంసలు అందడం కన్నా ఇక ఆనందానికి హద్దేముంటుంది ? ట్రెండ్ మార్చి… రీచ్ పెంచి కొత్త కమర్షియల్ ఫార్ములాని ఇండియన్ ఇండస్ట్రీకి నేర్పుతున్న తెలుగు సినిమా… మన కల్చర్ ని, సామాజిక బాధ్యతని కూడా గుర్తుచేయడం సంతోషించాల్సిన సంగతే ! అందుకే శ్రీమంతుడికి మనం చీర్స్ చెబుదాం.

Comments

comments

Article Categories:
Entertainment
Menu Title