మహేశ్ బాహుబలి కోట బద్దలు కొడతాడా ?

Written by

బాహుబలి హ్యాంగోవర్లో ఏ సినిమా వచ్చినా ఆవు పక్కన దూడలాగే కనిపిస్తుంది. 350 కోట్ల వసూళ్లంటే… డబ్బులే అన్నయ్యా అంటూ కార్టూన్లు గీస్తున్నారు. తమాషా కాదు. బాహుబలి దిగంతం(హారిజోన్) చూపించేసింది. 4500 స్క్రీన్స్ లో తొలి వారం…నాలుగైదు భాషల్లో డబ్ చేసి పక్కా కమర్షియల్ ప్లాన్ తో బరిలో దిగే సరికి రీసౌండ్ వచ్చేసింది. తెలుగు సినిమా స్టామినా తెలిసొచ్చింది ప్రపంచానికి. ఇక చూడ్డానికేముంటుంది భగవద్గీత తప్ప. అదేనండీ నా ప్రయత్నం నేను చేశా… ఇక నిర్ణయం అభిమాన ప్రేక్షకులదే అనుకోవడం తప్ప.

ఇలాంటి పరిస్థితి ఇపుడు మొదట ఫేస్ చేస్తున్నది సూపర్ స్టార్ మహేశ్. రెండు సినిమాలు డల్ అనిపించాయ్. మూడో సినిమా మూడ్ మార్చితీరాలి. పైగా మిర్చి లాంటి హై ఓల్టేజ్ సినిమా తీసిన కొరటాల శివ డైరెక్టర్. కాంబినేషన్ ఖతర్నాక్. టార్గెట్ అయితే మైండ్ బ్లోయింగ్. మరి ఏం జరగబోతోంది ? బాహుబలి పూర్తిగా డైరెక్టర్స్ మూవీ. హీరో ఎవరైనా ఇరగదీసి ఆడేయడం డైరెక్టర్స్ మూవీ స్పెషాలిటీ. త్రీ ఇడియట్స్, పీకే ఇలాంటివి. మరి కొన్ని హీరోనే నమ్ముకొని అమ్ముకునే సినిమాలుంటాయ్. మెస్ట్ లీ సల్మాన్ షారుఖ్ చేసేవన్నీ ఇలాంటివే. తెలుగులో కూడా మహేశ్, పవన్ లాంటివాళ్లు వాళ్ల చరిష్మాతోనే ఆడిస్తారు సినిమాలని.

మరి డైరెక్టర్స్ మూవీతో హీరో మూవీ ఢీ కొట్టగలదా? కొన్నిసార్లు కాదు చాలా సార్లు కష్టమే అవుతుంది. మళ్లీ అలాంటి మూవీనో లేదంటే అదే డైరెక్టర్ తో కాంబినేషనో పడితేనో తప్ప సాధ్యం కాకపోవచ్చు. అమీర్ త్రీ ఇడియన్స్ తర్వాత తలాశ్, ధూమ్ లాంటి సినిమాలు చేశాడు. తలాశ్ యావరేజ్ దిగువన ఆగిపోతే… ధూమ్ త్రీ సూపర్ హిట్ రేంజ్ ని దాటింది కానీ బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. మళ్లీ డైరెక్టర్స్ మూవీ పీకే పడితే… దానికి స్టార్ డమ్ తోడైతేనే అదరగొట్టింది పీకే. టాలీవుడ్ లోనూ ఇలాంటిదే మిరాకిల్ ఏదో జరగాలి. ప్రభాస్ ఫ్రంట్ లైన్ స్టార్ డమ్ ఉన్న హీరో కాదు (అభిమానులు క్షమించాలి) లేడీ ఫ్యాన్స్, స్టార్ డమ్ ఉన్నాయ్ కానీ రీచ్ కి పరిమితులున్నాయ్. అలాంటి హీరోతోనే అప్పీలే ఎస్సెట్ గా ఇంత హిట్ కొట్టినపుడు తిరుగులేని చరిష్మా ఉన్న హీరో తోడైతే రాజమౌళి సినిమా ఇంకెలా ఉంటుంది ? బాహుబలి – 2 తర్వాత మహేశ్ సినిమానే కాబ్టటి ఈ ప్రశ్నకి అదే సమాధానం అవుతుందేమో ! ఇంతకీ…ఇంత పొడుగు లాజిక్ ఎందుకంటే… ప్రతి సినిమానీ బాహుబలితో పోల్చుకొని, ప్రతి సీన్ నీ మహిష్మతి సెట్ లో ఊహించుకొని ఉపయోగం లేదు. ప్రస్తుతానికి ఓ మోస్తరుగా కానీవ్వడమే. మళ్లీ చక్రం తిరిగి బాక్స్ బద్దలయ్యే రోజు ఎప్పుడైనా రావొచ్చు !

Comments

comments

Article Tags:
· · ·
Article Categories:
Entertainment

Comments

Menu Title