మహీంద్రా TUV 300 బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభాస్

Written by

బాహుబలితో సంచలనం సృష్టించిన ప్రభాస్ నేషనల్ కటౌట్ అయిపోతున్నాడు. బాహుబలి హాలీవుడ్ రేంజ్ అంటూ ప్రశంసించిన ప్రముఖులు ఇపుడు ప్రభాస్ లుక్ తో ప్రమోట్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే బాహుబలి ఇపుడు నేషనల్ లెవెల్ పోస్టర్ బాయ్ అయిపోతున్నాడు. ఔను. ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలనుకుంటున్న దేశీ కంపెనీలు క్యూ కట్టేస్తున్నాయ్. కంటెంట్ చూసి ఇంప్రెస్ అయ్యి ప్రభాస్ కూడా ఓ సైన్ చేేసేశాడు. అదే మహీంద్రా బ్రాండ్ ప్రమోషన్. మార్కెట్లోకొస్తున్న మహీంద్ర ఎక్స్ యూవీ మినీ వర్షన్ స్టీరింగ్ ప్రభాస్ పట్టుకోబోతున్నాడు.

మాచో పల్స్ తో క్లిక్ అయిన మహీంద్ర ఎక్స్ యూవీ ఇపుడు మినీలుక్ తో వస్తోంది. మహీంద్రా టియువి 300. చూడ్డానికి క్లాస్ లుక్ ఉంటూనే మాచో అప్పీల్ తో అదరగొట్టడం టియువి 300 స్పెషాలిటీ. ఇది చూడ్డానికి సాలిడ్. వాడ్డానికి సూపర్ అనిపించాలన్నది మహీంద్రా గోల్. సో ఈ రెండూ కనిపిస్తూ ట్రెండీ అప్పీల్ తో రిజిస్టర్ అవ్వాలంటే బాహుబలి సపోర్ట్ కావాలనుకున్నారు మహీంద్రా గ్రూప్. హై ఓల్టేజ్ ఉన్న యాడ్ కూడా షూట్ అయ్యిందని… తొందర్లోనే టీవీల్లో రాబోతోందని అంటున్నారు. అంటే బాహుబలి-2 కన్నా ముందు ప్రభాస్ అప్పీల్ రీఫ్రెషింగ్ గా మరోసారి టీవీల్లో కనిపించబోతోందన్నమాట. ప్రభాస్ కి ఇదే ఫస్ట్ యాడ్.

బాహుబలి నేషనల్ లెవెల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ వెంచర్ అయిపోయింది. కేవలం రెండు సినిమాలతోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ఫ్రాంఛైజీగా రికార్డ్ సృష్టించబోతోంది. కమర్షియల్ సక్సెస్ కోసమే కాకపోయినా… అందులో ఉన్న స్టాండర్డ్స్ ఇండియన్ ఇంటలెక్చువల్స్ ని కూడా మెస్మైరైజ్ చేసింది. అందుకే సినిమా చూసీచూడగానే ఆనంద్ మహీంద్రా డిసైడ్ అయిపోయారట… దేశీ బాయ్ ప్రభాస్ ని బ్రాండ్ ప్రమోటర్ గా తీసుకోవాలని. మహీంద్రా జస్ట్ బిగినింగ్. ముందుముందు ఇలాంటివి చాలానే రాబోతున్నాయ్ అంటున్నారు ప్రభాస్ సన్నిహితులు. అంతేలే డ్యూడ్. వీలైతే బ్రాండ్స్ ప్రమోట్ చేద్దాం… మహా అయితే తిరిగి ఇంకొన్ని బ్రాండ్స్ వస్తాయ్.

Comments

comments

Article Categories:
Entertainment
Menu Title