బాహుబలి-2 లేటు అవుతుందా?

Written by

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. బాహుబలి ది బిగినింగ్‌ సినిమా చూసిన వారందరికి ఇదో అంతుచిక్కని ప్రశ్న. దీనికి సమాధానం.. రెండో పార్ట్‌లోనే చూడాలంటూ ట్విస్ట్‌ ఇచ్చాడు జక్కన్న. ఇంతకీ రెండో పార్ట్‌ ఎపుడు రిలీజవుతుంటే.. దానికో ఇయర్‌ గ్యాప్‌ ఇచ్చాడు. 2016 వరకూ ఆగాల్సిందేనన్నాడు. అయితే బాహుబలి టూ వచ్చే ఏడాదిలోపు వస్తుందా..? ఇంకా ఆలస్యమవుతుందా అన్న డౌట్‌ ఇపుడు.. సెకండ్‌ పార్ట్‌ కోసం ఎదురుచూస్తున్న వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

బాహుబలి పార్ట్‌ వన్ సూపర్‌ సక్సెసవ్వడంతో.. యూనిట్‌ మొత్తం ఎంజాయ్‌ మూడ్‌ను బయటికి రాలేకపోతున్నారు. డైరెక్టర్‌ జక్కన్న టీవీ ఇంటర్వూలిస్తూ.. హాయిగా గడిపేస్తుంటే.. ప్రభాస్‌ యూరప్‌ వెళ్లి.. వచ్చినట్టు లేడు. రానా రుద్రమాదేవి ప్రమోషన్‌కు సిద్ధమవుతుంటే.. అనుష్క సైజ్‌ జీరో షూటింగ్‌లో బిజీ అయిపోయింది. ఇలా ఎవరికి వారు తమ తమ పనిలో మునిగిపోతే.. బాహుబలి ది కన్‌క్లూజన్‌ పూర్తయ్యేది ఎప్పుడు. ఫస్ట్‌ పార్ట్‌కే మూడేళ్లు టైమ్‌ తీసుకున్న రాజమౌళి.. ఇపుడు రెండో పార్ట్‌ ఏడాది కంప్లీట్‌ చేస్తాడా అంటున్నారు.

బాహుబలి పార్ట్‌ టూ పై సందేహాలు వద్దంటున్నారు మూవీ యూనిట్‌. అల్రెడీ 40 శాతం షూటింగ్‌ పూర్తయైంది. మిగిలింది 60 శాతం మాత్రమే. అయితే బాహుబలి ఫ్యాన్స్‌ మాత్రం వీలైంత తొందరగా మూవీని పూర్తి చేసి రిలీజ్‌ చేయాలంటున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని ఉత్కంఠతో ఉన్నారు. ఇపుడంతా జక్కన్న చేతిలో ఉంది. ఏం చేస్తాడో.. బాహుబలి పార్ట్‌ 2 ఎపుడు రిలీజ్‌ చేస్తాడో…

-పవన్‌

Comments

comments

Article Categories:
Entertainment
Menu Title