బాహుబలి దెబ్బకి వాళ్లిద్దరికీ గింగిరాలే…

Written by

రికార్డులు బద్దలు కొడితే తోపు అంటారు. మరి అలాంటి తోపుల్నే పక్కకు తోసేస్తే ఏమంటారు ? కనిపెట్టాలి కొత్త మాట. బాహుబలి ఇలాంటి తోపుల్ని నెట్టేసి ఆల్ టైమ్ హైయ్యెస్ట్ గ్రాసర్స్ లో థర్డ్ స్పాట్ కి వచ్చేసింది. ఫోర్బ్స్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం… బాహుబలి దండయాత్ర బంపర్ హిట్ రేంజ్ ని దాటిపోయింది. పీకే, ధూమ్ త్రీ తర్వాత 5 బిలియన్ క్లబ్ లో చేరింది. ఐదొందల కోట్లు క్రాసైపోయాయ్ ఇప్పటి వరకూ వసూళ్లు. భజరంగీ భాయ్ జాన్ బీట్ చేసే అవకాశమైతే ఉంది కానీ… టాప్ త్రీలో ప్లేస్ కి మాత్రం ఢోకా లేదు. ఎందుకంటే బాహుబలి, భాయ్ జాన్ రెండూ ధూమ్ ని ఫోర్త్ స్పాట్ కి నెట్టి… రెండు మూడు స్పాట్స్ లో సెటిల్ కాబోతున్నాయ్.

సల్మాన్, అమీర్ అంటే వేరు. హిందీ మార్కెట్ ఎక్కువ. ఫ్యాన్స్ ఎక్కువ. వరల్డ్ వైడ్ రీచ్ ఎక్కువ. కానీ తెలుగు సినిమా అలాకాదు. అయినా మన సత్తా ఏంటో బాహుబలి చూపిించింది. హిందీ తమిళంతోపాటు మిగతా భాషల్లోకి డబ్ కావడం… హాలీవుడ్ రేంజ్ అప్పీల్ అన్నీ కలిసొచ్చాయ్. అందుకే బాహుబలి ఇపుడు పీక్స్ టచ్ చేస్తోంది. ఇదే రికార్డ్ అనుకుంటే ముందు ముందు మరిన్ని వండర్స్ ఖాయంగా కనిపిస్తున్నాయ్. కేవలం రెండు సినిమాలతో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన తొలి ఇండియన్ సినిమాగా బాహుబలి అవతరించబోతోంది.

యాక్షన్ ఘట్టాలు పెద్దగా లేకుండా రాజమౌళి పూర్తిగా తన మార్క్ చూపించముందే బాహుబలి బిగినింగ్ ఈ రేంజ్ లో ఉంది. మరి ఆ మార్క్ ఏదో కనిపిస్తే… యాక్షన్ సీన్స్ ఎక్కువుండి… దానికితోడు రెండుమూడు ట్విస్ట్ లు గా యాడ్ అయితే ఆ ఫీవర్ ఊహించలేం. అందుకే రెండో భాగం ఇంతకు మించి నెన్సేషన్ కావడం ఖాయమనిపిస్తోంది. రజనీ రికార్డులు దాటేసి, ఖాన్స్ ల్యాండ్ మార్క్ ని తుడిచిపెట్టేసి బాహుబలి చేస్తున్న జైత్రయాత్ర తెలుగోడి సత్తాని గ్లోబలైజ్ చేస్తోంది. తెలుగులో ఇలాంటి సినిమాలు తీస్తారా… అంటూ హాలీవుడ్ బుగ్గలు నొక్కుకునేలా చేస్తోంది. ఫోర్బ్స్ ప్రశంసలు దాని రిఫ్లెక్షన్ మాత్రమే !

Comments

comments

Article Categories:
Entertainment

Comments

Menu Title