ఫిఫ్టీ కొట్టే మొనగాడెవరు..?

Written by

చిరంజీవి 150వ సినిమా గురించి చర్చించుకుంటున్నాం.. బాలక్రిష్ణ సెంచరీ మూవీయే ఇపుడు హాట్‌ టాపిక్‌. ఇదంతా గతం కానుంది. ప్రజెంట్‌ జనరేషన్‌లో హాఫ్‌ సెంచరీ చేయడమే కష్టమైపోయింది మన హీరోలకు. వాళ్ల సినిమాలు ఎపుడు స్టార్ట్‌ అవుతుందో.. ఎపుడు ఎండవుతుందో వారికే తెలియదు. ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్‌ చేస్తామంటూ మంగమ్మ శపథాలు చేసినా.. టైమ్‌కు రిలీజ్‌ చేసిన హీరో లేడు. పవన్‌, మహేశ్‌, ప్రభాస్‌, బన్నీ, చరణ్‌… వీళ్లందరిలో ఏ ఒక్కరూ.. 50 సినిమా పూర్తి చేస్తే అదో అద్భుతం.

పవన్‌, మహేశ్‌లు టచ్‌ చేస్తారా..?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. ఎపుడు సినిమా తీస్తాడో.. ఎపుడు రిలీజ్‌ చేస్తాడో ఎవరికి తెలియదు. గబ్బర్‌ సింగ్‌ వరకూ ఏడాదికి ఒకటి రిలీజైనా.. తర్వాత స్లో అయిపోయాడు. ఇటు పాలిటిక్స్‌, అటు సినిమాలు రెండింటిని వదులుకోలేక.. నచ్చిన స్క్రిప్ట్‌ను మూడోచ్చినప్పుడు తీసేస్తున్నాడు. 20 ఏళ్ల సినీ కెరీర్‌లో పవన్‌ తీసింది కేవలం 20 సినిమాలే.. ఎంత ట్రై చేసినా.. ఇంకో పది సినిమాలకు మించదు పవన్‌ కళ్యాణ్‌ మూవీస్‌ కౌంట్‌‌. ఇక ఆ లోపు రాజకీయాల్లో బిజీ అయిపోతే.. అంతే సంగతులు. టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబుది ఇదే పరిస్థితి.. సినిమాల మీదే ఫుల్‌గా కాన్సన్‌ట్రేట్‌ చేసినా.. సెలక్టెడ్‌గా వెళ్తుండడంతో బండి ముందుకు కదలడం లేదు. సినిమా రేపే స్టార్ట్‌ అవుతుంది.. ఎపుడు పూర్తవుతుందో తెలియదని చెబితే మహేశ్‌బాబు డేట్స్‌ ఇస్తారన్న పూరీ కామెంట్స్‌ కరెక్టే అనిపిస్తుంది. ఫ్లోలో తీసేయడం కంటే.. స్లోగా తీయడమే బెటర్‌ అంటాడు. అందుకే కొన్ని మూవీస్‌కి మహేశ్‌ ఎందుకు ఏళ్లకు ఏళ్ల టైమ్‌ తీసుకుంటాడో అర్థం కాదు. 1999 ఎంట్రీ ఇచ్చినా… ఇప్పటికీ పూర్తి చేసిన సినిమాలు జస్ట్‌ 21 మాత్రమే. ఇప్పటికే 40లోకి ఎంటరైన మహేశ్‌ ఫిఫ్టీ రీచ్‌ కావడం కష్టమే.

రికార్డుల బాహుబలి పొజిషనేంటి..?

మహేశ్‌, పవన్‌లేనా.. ప్రభాస్‌, చరణ్‌, బన్నీల పరిస్థితి ఇంతే.. ఈ హీరోలకు చేసే టైమున్నా… అంత కరేజ్‌ లేదు. ప్రభాస్‌ బాహుబలికే మూడేళ్లు ఖర్చు చేశాడు. బాహుబలి 2 పూర్తి చేసేందుకు ఇంకో ఏడాదిన్నర పడుతుంది. అంటే నాలుగేళ్లకు కేవలం రెండు సినిమాలే. అలాంటిది 50 సినిమాలు చేయాలంటే.. సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకెళ్లాలి. కానీ బాహుబలి భారీ విజయంతో.. తర్వాతి సినిమాలు కూడా సక్సెస్‌ సాధించాలనుకొని.. ఆచితూచి అడుగులేస్తే.. 50 మూవీస్‌ పూర్తి చేయడం.. డౌటే. ఇప్పటికే 35 వసంతాలను ఖర్చు చేసుకున్న అమరేంద్రుడు… మ్యాజిక్‌ నెంబర్‌ను టచ్‌ చేయాలంటే మిరాకిల్స్‌ చేయాల్సిందే.

మెగా ఫ్యామిలీ హీరోలేదేనా.. ఈ ఘనత

మెగా ఫ్యామిలీ హీరోలు బన్నీ, చరణ్‌ హాఫ్‌ సెంచరీ కంప్లీట్‌ చేస్తారా..? అంటే డౌట్‌..కాదు కాదు కష్టమనే చెప్పాలి. చరణ్‌ సూపర్‌ఫాస్ట్‌గా సినిమాలు తీస్తున్నట్లు అనిపించినా… అంత సీన్‌ కనిపంచడం లేదక్కడ. ఎనిమిదేళ్ల కెరీర్‌లో చెర్రీ చేసిన సినిమాలు 8. సక్సెస్‌లు వస్తే పర్లేదు.. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకెళ్తాడు. కానీ ప్లాప్‌ పంచ్‌ పడితే మాత్రం.. అక్కడే ఆగిపోతాడు. స్టోరీ సెలక్షన్‌లోనూ చెర్రీ కంటే.. చిరంజీవి హ్యాండ్‌ ఎక్కువగా ఉండడం… అందరికి నచ్చితేనే ఆ సినిమా పట్టాలెక్కడం.. సీజన్‌ కలిసి రావడం.. ఇలా అన్నీ కలిసొస్తేనే.. చెర్రీ బొమ్మ థియేటర్లలో పడుతుంది. ఎక్కడ బెడిసి కొట్టినా.. కెరీర్‌ ట్రైన్‌ స్ట్రక్‌ అయిపోతుంది. ఇలా ట్రాక్‌ రికార్డ్‌తో తండ్రిలా 150 కాదు కదా.. 50 కొట్టడమే ఎక్కువ. బన్నీ పరిస్థితి ఇంతే. ఇంతకు ముందంటే.. స్టార్‌ ఇమేజ్‌ లేకపోవడంతో సినిమాల మీద సినిమాలు చేసేశాడు. కానీ రేసుగుర్రం, సన్నాఫ్‌ సత్యమూర్తి హిట్లతో అర్జున్‌కి కూడా స్టార్‌ రేంజ్‌ వచ్చేసింది. దీంతో సెలక్టివ్‌గా… హిట్‌ డైరెక్టర్లకే ఛాన్సులిస్తూ.. స్టోరీలపై కాన్సన్‌ట్రేట్‌ చేస్తున్నాడు. 12 ఏళ్ల కెరీర్‌లో 13 మూవీస్‌ మాత్రమే తీసిన బన్నీ.. 50 మూవీస్‌ టచ్‌ చేయడం కష్టం మాత్రమే కాదు.. అసాధ్యం.

ఫిఫ్టీ క్రాస్‌ చేసే మొనగాడు..!

ఇపుడున్న జనరేషన్‌లో స్టార్‌ హీరోలంతా.. ఫిఫ్టీని టచ్‌ చేయలేరు. మరీ హాఫ్‌ సెంచరీ కొట్టే మొనగాడే లేడా..? 50 మూవీస్‌ కొట్టే దమ్ము.. ఛాన్సెస్‌ ఒక్కడికే ఉన్నాయి. ఏజ్‌ ఫ్యాక్టర్‌లో చూసుకున్నా.. పర్ఫామెన్స్‌, సినిమాలు త్వరగా కంప్లీట్‌ చేయడంలో అయినా.. ఎన్టీఆర్‌ మాత్రమే ఆ ఫీట్‌ సాధించగలడంటున్నారు. యంగ్‌ ఏజ్‌లోనే ఇండస్ట్రీలోకి ఎంటరై.. అల్లాడించాడు. అదే ఊపులో సినిమాలు తీసుకుంటూ పోయాడు. తన 14 ఏళ్ల కెరీర్‌లో 24 సినిమాలు కంప్లీట్‌ చేసేశాడు యంగ్‌ టైగర్‌. అంటే హాఫ్‌ సెంచరీలో అపుడే హాఫ్‌ కంప్లీట్‌ చేశాడు. జూనియర్‌కు అటూ ఏజ్‌.. ఇటు ఫ్యాన్‌బేస్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయి. కాస్త జోరు చూపిస్తే.. అడ్డుకోవడం కష్టం. ఇంకో పదేళ్లలో ఫిఫ్టీ మార్క్‌ టచ్‌ చేసేస్తాడు ఈ నందమూరి హీరో. అందుకే ఫిఫ్టీ కొట్టే ఏకైక మొనగాడు.. ఎన్టీఆర్‌ ఒక్కడే..!

-పవన్‌

Comments

comments

Article Categories:
Entertainment
Menu Title