దేవిశ్రీప్రసాద్ కి జన్మదిన శుభాకాంక్షలు

Written by

సినిమా ఇండస్ట్రీలో బాగా నెగ్గుకురావాలన్నా,మంచిపేరు సంపాదించుకోవాలన్నా, హిట్ కొట్టాలన్నా.. వారసత్వమయినా ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలైన ఇండస్ట్రీలోకి enter అవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తండ్రి కధా రచయిత సత్యమూర్తి,నాయనమ్మ దేవీ మీనాక్షి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. ఇక దేవిశ్రీప్రసాద్ పుట్టింది తూర్పుగోదావరి జిల్లాలోని వెదురుపాక..అదీ 1979 ఆగష్ట్ 2 న,తర్వాత వాళ్లు చెన్నై లో సెటిల్ అయ్యారు.

దేవిశ్రీ ప్రసాద్ Instruments వాయిస్తాడు.మాండలిన్ శ్రీనివాస్ దగ్గర శిష్యరికం అతని సంగీతం వెనక ఉన్న పెద్ద బలం.

మొట్టమొదటిసారి దేవి సంగీతం అందించినది అతని 20 యేళ్ళ వయసులో విడుదలయిన కోడిరామకృష్ణ సినిమా “దేవి” కి తర్వాత శ్రీను వైట్ల 2001 లో తీసిన సినిమా ఆనందం దేవీకీ బాగా పేరు తెచ్చిన సినిమా కూడా. ఈసినిమా రిలీజ్ కాకుండానే.. దేవిశ్రీ, సినిమా పాటలని ప్రదర్శించాడు,అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మన్స్ కూడా జోడించి మరీ చేసాడు..తెలుగు ఇండస్ట్రీలో ఇదే మొదటిసారి ఒక సంగీత దర్శకుడు తన పాటలకి డాన్స్ కూడా చేర్చి ప్రదర్శించడం.

కృష్ణవంశీ తీసిన ఖడ్గం లో గాయని కల్పన చేత “ముసుగువెయ్యద్దు మనసుమీద” అని పాడించినా,తర్వాత వర్షం సినిమాలో బాలూ గారబ్బాయి చరణ్ చేత “మెల్లగా కరగనీ రెండు మనసులదూరం” పాడించినా కరెక్ట్ గా ప్రేక్షకులకిచేరువవుతుందనే అతని నమ్మకం.ఇక మన్మధుడు సినిమాలో ప్రతీపాట అందరికీ గుర్తుండేలా చేసాడు దేవి. “గుండెల్లో ఏముందో కళ్లల్లో తెలుస్తుందీ”..ఈపాట మర్చిపోయే చాన్సేలేదు.. చిరంజీవికి ‘శంకర్ దాదా MBBS’,బాలకృష్ణకి ‘లెజెండ్’,నాగార్జునకి ‘మన్మధుడు ‘, వెంకటేష్ కి ‘తులసి ‘,పవన్ కల్యాణ్ కి ‘జల్సా’,మహేష్ బాబు కి ‘నేనొక్కడినే’, సిద్ధార్ధ్ కి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,నాగచైతన్యకి 100% లవ్..ఇంకా చాలా సినిమాలు చేసినా ఇవి జస్ట్ గుర్తుచెయ్యడం మాత్రమే.. చాలారోజులపాటు.. అనంత శ్రీరాం రాసిన,శ్రియాఘోషల్ పాడినా “చలి చలి గా అల్లింది” అనే పాట చాలామంది ringtone గా ఉండేది..

ఇక కమల్ హాసన్ దశావతారం కి పనిచేసాడు దేవి..ఐటెం సాంగ్స్ కి స్పెషల్ గా శ్రద్ధపెడతాడు దేవి..అందుకే అవి చాలా పాపులర్.”దబాంగ్” అనే హిందీ సినిమా మాతృక అయినా ‘గబ్బర్ సింగ్’ కి చాలామంచి సంగీతం ఇచ్చాడు దేవి..అదే జోష్ “అత్తారింటికి” దారేది లో కూడా చూపించి మొదటిసారి స్క్రీన్ మీద పవన్ తో కనిపించాడు..తమిళ్,హిందీ,మలయాళం సినిమాలకీ సంగీతాన్ని అందించాడు..స్టేజ్ మీద చాలా ఎనర్జటిక్ గా కనిపినంచే దేవి పాటలు రాస్తాడు,పాడతాడు కూడా. యూత్ కి మాత్రమే కాదు అందరికీ నచ్చే సంగీతాన్ని అందించి,ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకున్న దేవిశ్రీప్రసాద్ కి జన్మదిన శుభాకాంక్షలు.

Comments

comments

Article Categories:
Entertainment

Comments

Menu Title