దత్తత తీసుకుంటారా..? లావైపోతారా..?

Written by

శ్రీమంతుడు హిట్‌తో ఇపుడు అందరి నోళ్లలో దత్తత అనే మాట నానిపోతుంది. మనకెంతో ఇచ్చిన ఊరికి తిరిగిచ్చేయాలని.. లేకుంటే లావైపోతామంటున్నారు ఇపుడు ఎవరిని కదిపినా. శ్రీమంతుడు మూవీలోని హర్ష క్యారెక్టర్‌ రూట్‌లోనే వెళ్తానంటున్నాడు సూపర్‌స్టార్‌ మహేశ్‌. తన సొంతూరు బుర్రిపాలెంను దత్తత తీసుకుంటానంటున్నాడు. ఎపుడో ఈ నిర్ణయాన్ని ప్రకటించినా.. సినిమా ప్రమోషన్‌ అనుకుంటారేమోనని వెనక్కి తగ్గానన్నాడు.. కాస్త గ్రౌండ్‌ వర్క్‌ ప్రిపేర్‌ చేసుకున్నాక.. రంగంలోకి దిగిపోతానంటున్నాడు. అయితే ఇపుడు మహేశ్‌ రూట్‌లో అందరూ నడుస్తారా..? ఇపుడిది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

శ్రీమంతుడు సినిమాతోనే అని కాదు కానీ… గ్రామాలను దత్తత తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పట్నుంచో చెబుతున్నాయి. దానిని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ లాంటి వాళ్లు చేసి చూపించారు. కానీ టాలీవుడ్‌లో మాత్రం ఎవ్వరూ స్పందించలేదు. అయితే తన బావ చెప్పాడని మహేశ్‌ డిసైడైతే.. అదే బాటలో మిగతా హీరోలు నడిచే అవకాశం ఉందంటున్నారు. ఇలా కొందరు స్టార్లు… ముందుకొచ్చినా.. ఓ మంచి పనికి శ్రీకారం చుట్టినట్లే. ఆ స్పూర్తితో ఎంతో మంది యువకులు, ఎన్నారైలు తమ గ్రామాలను అడాప్ట్‌ తీసుకుంటే పరిస్థితే మారిపోతుంది. ఎన్ని మైళ్ల ప్రయాణమైన సరే.. ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మరి ఇండస్ట్రీలో రికార్డులు సృష్టిస్తున్న మహేశ్‌.. ఈ సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టి.. మిగతా హీరోలకు ఆదర్శంగా నిలుస్తాడని ఆశిద్దాం.

-పవన్

Comments

comments

Article Tags:
· ·
Article Categories:
Entertainment
Menu Title